Joint admission board
-
ఐఐటీ ప్రవేశాలలో మార్పులు!
ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలలో బీటెక్‌లో ప్రవేశాలకు సంబంధించిన విధానాల్లో తాజా మార్పులకు రంగం సిద్ధమైంది. ప్రధానంగా ప్రస్తుతం ఐఐటీల్లో ప్రవేశాలకు అమలు చేస్తున్న.. ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సుల్లో టాప్-20 పర్సంటైల్ అనే నిబంధనకు ప్రత్యామ్నాయం చూసే దిశగా జాయింట్ అడ్మిషన్ బోర్డ్ యోచిస్తోంది. 2012 నుంచి అమలు చేస్తున్న టాప్-20 పర్సంటైల్ నిబంధన విషయంలో విద్యార్థుల్లో నిరసన కొనసాగుతూనే ఉంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు వచ్చినా బోర్డ్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలవక ఎందరో విద్యార్థులు ఐఐటీలో సీటు అవకాశం కోల్పోయారు. ఇదే విషయంపై ఐఐటీ డెరైక్టర్లతో కూడిన జాయింట్ అడ్మిషన్ బోర్డ్ ప్రత్యామ్నాయాలను రూపొందించేందుకు ఉపక్రమించింది. త్వరలో జరిగే జేఏబీ మలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మార్పులకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే 2015 నుంచే అమలు చేయనున్నట్లు సమాచారం. ఐఆర్‌ఎంఏలో.. పీజీ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్మెంట్ దేశంలో ప్రముఖ బీస్కూల్.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ - ఆనంద్.. పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్మెంట్ (పీఆర్ఎం) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత: 50 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం) మార్కులతో 10+2+3 విద్యా విధానంలో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు.. ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం: క్యాట్-2014లో వచ్చిన స్కోర్ ఆధారంగా.. ఐఆర్ఎంఏ ప్రవేశపరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ ఆధారంగా ప్రవేశం ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 15, 2014 వెబ్సైట్: www.irma.ac.in -
15 నుంచి జేఈఈ-మెయిన్ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీలు, కేంద్ర ప్రాయోజిత సంస్థల్లో ప్రవేశానికి ఏప్రిల్ 6న నిర్వహించనున్న జేఈఈ-మెయిన్ ప్రవేశ పరీక్షకు నవంబరు 15 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) ప్రకటించింది. ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ-అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్‌ను జేఏబీ శుక్రవారం విడుదల చేసింది. జేఈఈ- అడ్వాన్స్డ్ ప్రవేశపరీక్షకు సంబంధించి ముఖ్యమైన తేదీలు, సిలబస్, అర్హతలు వివరిస్తూ జేఈఈ-మెయిన్ తేదీలను కూడా ప్రస్తావించింది. జేఈఈ- అడ్వాన్స్డ్ పరీక్ష రాసే అభ్యర్థులు జేఈఈ-మెయిన్‌లో తొలి 1.5 లక్షల ర్యాంకర్ల జాబితాలో ఉండాలని, దీనిని రిజర్వేషన్లవారీగా ప్రకటిస్తారని తెలిపింది. 2013, ఆ తరువాత ఇంటర్ ఉత్తీర్ణులైనవారే అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులని ప్రకటించింది. రెండుసార్లు మాత్రమే ఈ ప్రవేశ పరీక్ష రాసేందుకు అవకాశం ఉందని, అదికూడా రెండు వరుస సంవత్సరాల్లో మాత్రమే రాయొచ్చని తెలిపింది. 2013లో ఉత్తీర్ణులై ఉంటే అప్పటి బోర్డు టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలని పేర్కొంది. 2013లో ఇంటర్ ఉత్తీర్ణులై ఇంప్రూవ్ మెంట్ రాసేవాళ్లకు 2014 కటాఫ్ వర్తిస్తుందని తెలిపింది. 2012లో లేదా అంతకుముందు ఇంటర్ రాసిన వాళ్లు అనర్హులని పేర్కొంది. అడ్వాన్స్డ్ రాసేందుకు జనరల్, ఓబీసీ అభ్యర్థులు అక్టోబర్ 1, 1989న లేదా ఆ తరువాత జన్మించి ఉండాలని, ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ డిసేబులిటీస్ (పీడబ్యూడీ) అయితే అక్టోబర్ 1, 1984న లేదా ఆ తరువాత పుట్టిన వాళ్లు అర్హులని తెలిపింది. అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు రాష్ట్రంలో 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఐఐటీ-మద్రాస్ జోన్ పరిధిలో హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, వరంగల్, ఐఐటీ-ఖరగ్‌పూర్ జోన్ పరిధిలో విశాఖపట్నం నగరాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేసింది.