15 నుంచి జేఈఈ-మెయిన్ దరఖాస్తుల స్వీకరణ | JEE-Main applications to be received on November 15 | Sakshi
Sakshi News home page

15 నుంచి జేఈఈ-మెయిన్ దరఖాస్తుల స్వీకరణ

Published Sat, Oct 26 2013 2:54 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM

15 నుంచి జేఈఈ-మెయిన్ దరఖాస్తుల స్వీకరణ

15 నుంచి జేఈఈ-మెయిన్ దరఖాస్తుల స్వీకరణ

సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీలు, కేంద్ర ప్రాయోజిత సంస్థల్లో ప్రవేశానికి ఏప్రిల్ 6న నిర్వహించనున్న జేఈఈ-మెయిన్ ప్రవేశ పరీక్షకు నవంబరు 15 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) ప్రకటించింది. ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ-అడ్వాన్స్‌డ్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్‌ను జేఏబీ శుక్రవారం విడుదల చేసింది. జేఈఈ- అడ్వాన్స్‌డ్ ప్రవేశపరీక్షకు సంబంధించి ముఖ్యమైన తేదీలు, సిలబస్, అర్హతలు వివరిస్తూ జేఈఈ-మెయిన్ తేదీలను కూడా ప్రస్తావించింది. జేఈఈ- అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అభ్యర్థులు జేఈఈ-మెయిన్‌లో తొలి 1.5 లక్షల ర్యాంకర్ల జాబితాలో ఉండాలని, దీనిని రిజర్వేషన్లవారీగా ప్రకటిస్తారని తెలిపింది.
 
  2013, ఆ తరువాత ఇంటర్ ఉత్తీర్ణులైనవారే అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హులని ప్రకటించింది. రెండుసార్లు మాత్రమే ఈ ప్రవేశ పరీక్ష రాసేందుకు అవకాశం ఉందని, అదికూడా రెండు వరుస సంవత్సరాల్లో మాత్రమే రాయొచ్చని తెలిపింది. 2013లో ఉత్తీర్ణులై ఉంటే అప్పటి బోర్డు టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలని పేర్కొంది. 2013లో ఇంటర్ ఉత్తీర్ణులై ఇంప్రూవ్ మెంట్ రాసేవాళ్లకు 2014 కటాఫ్ వర్తిస్తుందని తెలిపింది. 2012లో లేదా అంతకుముందు ఇంటర్ రాసిన వాళ్లు అనర్హులని పేర్కొంది.

అడ్వాన్స్‌డ్ రాసేందుకు జనరల్, ఓబీసీ అభ్యర్థులు అక్టోబర్ 1, 1989న లేదా ఆ తరువాత జన్మించి ఉండాలని, ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ డిసేబులిటీస్ (పీడబ్యూడీ) అయితే అక్టోబర్ 1, 1984న లేదా ఆ తరువాత పుట్టిన వాళ్లు అర్హులని తెలిపింది. అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు రాష్ట్రంలో 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఐఐటీ-మద్రాస్ జోన్ పరిధిలో హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, వరంగల్, ఐఐటీ-ఖరగ్‌పూర్ జోన్ పరిధిలో విశాఖపట్నం నగరాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement