నగరంలో నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ స్థలాన్ని మార్చాలంటూ హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారించింది.
ధర్నా చౌక్ మార్పుపై పిల్ వాయిదా
Published Tue, Feb 28 2017 2:13 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
హైదరాబాద్: నగరంలో నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ స్థలాన్ని మార్చాలంటూ హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారించింది. ధన్ గోపాల్ రావు అనే వ్యక్తి ఈ పిల్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనర్‌లకు, హైదరాబాద్ డీసీపీకి హైకోర్టు నోటీసులు పంపింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
Advertisement
Advertisement