‘పీఈటీ’ నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ | Highcourt rejects pitetion to stop PET posts | Sakshi

‘పీఈటీ’ నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ

Jul 1 2017 3:10 AM | Updated on Aug 31 2018 8:34 PM

తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ విద్యా సంస్థల్లో జరిగే ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ) పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ విద్యా సంస్థల్లో జరిగే ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ) పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. నియామకాల ప్రక్రియ కొనసాగించవచ్చునని, నియామకాలన్నీ తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. పీఈటీ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయా లంటూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్, కార్యదర్శి, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ విద్యా సంస్థల కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement