PET posts
-
ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత
-
పోస్టులు పెంచకుంటే ఆత్మహత్యలే
సాక్షి, అమరావతి బ్యూరో: పీఈటీ పోస్టులు పెంచుతారా.. లేక చావమంటారా? వెయ్యికి పైగా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి మోసం చేస్తారా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభ్యర్థులు మండిపడ్డారు. పరీక్షల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టి కోచింగ్‌లు తీసుకున్నామని, కానీ ప్రభుత్వం కేవలం 47 పోస్టుల భర్తీకి సిద్ధపడుతోందంటూ ఆందోళనకు దిగారు. ‘బాబూ..జాబు’ అంటూ నినదించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి అధ్వర్యంలో రాష్ట్ర వ్యాపంగా 13 జిల్లాల నుంచి సుమారు మూడు వేల మంది పీఈటీ అభ్యర్థులు విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ర్యాలీగా ధర్నా చౌక్ వద్దకు చేరుకున్నారు. ‘బాబు... జాబు ’ అంటూ నినాదాలు, ఈలలతో హోరెత్తిం చారు. లబ్బీపేటలో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీఎస్సీ–2018లో 1,056 పీఈటీ పోస్టులు భర్తీ చేస్తామని శాసన మండలి సాక్షిగా మానవవనరుల శాఖామంత్రి ప్రకటించారని తెలిపారు. దీంతో తాము అప్పటివరకు చేస్తున్న ఉద్యోగాలు వదులుకుని రెండు సంవత్సరాలు వ్యయ ప్రయాసలకోర్చి కోచింగ్‌లు తీసుకున్నామని చెప్పారు. తీరా ఇటీవల ప్రభుత్వం చేసిన ప్రకటన సుమారు 20 వేల మంది పీఈటీ అభ్యర్థులను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసిందని అవేదన వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం కేవలం 47 పోస్టుల భర్తీకి మాత్రమే పూనుకుంటూ నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 1,056 పోస్టులతో డీఎస్సీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం వేలాదిగా రాజధానికి తరలివచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువవంటి స్పందన రాకపోవడంతో కొంతమంది అభ్యర్థులు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర్లోని లబ్బీపేట వాటర్ ట్యాంక్ ఎక్కారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం వెంటనే ముందు ప్రకటించిన విధంగా 1,056 పోస్టులతో డీఎస్సీ ప్రకటించాలని లేని పక్షంలో ఇక్కడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని నినాదాలు చేసారు. పోలీసులు ఒక్కొక్కరిని కిందకు దింపుతుండటం, కింద ఉన్న మహిళా అభ్యర్థులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తుండటంతో ఏలూరుకి చెందిన వి.నాగమణి కత్తితో కోసుకునే ప్రయత్నం చేసింది. ‘ప్రభుత్వం మా జీవితాలతో అడుకుంటోందని, మాకిక చావే శరణ్యం’ అంటూ ఆమె రోదించడం అక్కడున్నవారిని కదిలించింది. చివరకు అభ్యర్థులందరినీ అరెస్ట్ చేసిన పోలీసులు పటమట పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ అనంతరం విడుదల చేశారు. ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టిన నిరుద్యోగులకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు సంఘీభావం ప్రకటించారు. ఎస్ఎఫ్ఐ, బీజేవైఎం నేతలు కూడా ధర్నా చౌక్ వద్దకు చేరుకొని తమ మద్దతు ప్రకటించారు. ఇవీ డిమాండ్లు ♦ ఖాళీగా ఉన్న అన్ని పీఈటీ పోస్టులు భర్తీ చేసేలా నోటిఫికేషన్ విడుదల చేయాలి ♦ ఫిజికల్ లిటరసీ అమలు చేస్తూ ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలి– ప్రతి – ప్రతి పాఠశాలలో ఒక ఎస్ఏ, ఒక పీఈటీని నియమించేలా తెచ్చిన జీఓ నం.29ని అమలు చేయాలి ♦ 70 శాతం ప్రమోషన్లతో, 30 శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేపట్టాలి. ♦ ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించాలి. ఉన్న ఉద్యోగాలు పోయాయి.. ప్రభుత్వ ప్రకటనతో చేస్తున్న ఉద్యోగాలు వదిలి వేలాది రూపాయలు అప్పు చేసి కోచింగ్ తీసుకుంటున్నాం. మా జిల్లాలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయమంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. ఎన్నడూ లేనివిధంగా పీఈటీ పోస్టులకు టెట్ నిర్వహించిన ప్రభుత్వం ఇలా మోసం చేయడం బాధాకరం. – ఐ.శైలజ, బీపీఈడీ, గుంటూరు. వైఎస్సార్‌లా మెగా డీఎస్సీ ప్రకటించాలి.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008లో మెగా డీఎస్సీ ప్రకటించి వేలాది మంది నిరుద్యోగులకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. కానీ చంద్రబాబు మోసం చేశారు. 2012, 2014లో ప్రకటించిన డీఎస్సీల్లో కేవలం వందల్లోనే ఖాళీలు భర్తీ చేస్తుండటంతో వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేచిచూస్తున్నారు. వెంటనే వైఎస్సార్‌లాగా మెగా డీఎస్సీ ప్రకటించాలి. –శ్రీనివాస్, డోన్, కర్నూలు. -
‘పీఈటీ’ నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో జరిగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) పోస్టుల భర్తీ నోటిఫికేషన్ నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. నియామకాల ప్రక్రియ కొనసాగించవచ్చునని, నియామకాలన్నీ తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. పీఈటీ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయా లంటూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శి, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
పాత పింఛన్ అమలుకు ఉద్యమాలు
► జాక్టో కన్వీనర్ కరుణానిధి మూర్తి ► ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పాత పింఛన్ విధానం అమలు కోసం పోరాటాలను ఉద్ధృతం చేస్తామని జాక్టో కన్వీనర్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కరుణానిధిమూర్తి తెలిపారు. ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం జాక్టో రెండో దశ ఆందోళనలో భాగంగా సోమవారం కర్నూలు ఆర్డీఓ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపాధ్యాయులు ముందుగా జెడ్పీ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సంద్భరంగా కరుణానిధిమూర్తి మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. సర్వీసు రూల్స్ ప్రక్రియను వేగవంతం చేసి ఎంఈఓ, డైట్, జేఎల్ పదోన్నతులను చేపట్టాలని, పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతాలు ఇవ్వాలన్నారు. ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్ రూపొందించాలన్నారు. అనంతరం జాక్టో డిమాండ్లను నివేదిక రూపంలో ఆర్డీఓకు అందజేశారు. ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమానికి డిగ్రీ కళాశాలల అధ్యాపకుల అసోసియేషన్ ప్రతినిధి దళవాయి శ్రీనివాసులు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో జాక్టో నాయకులు జీవీ సత్యనారాయణ, చంద్రశేఖర్, చంద్రశేఖర శర్మ తదితరులు పాల్గొన్నారు. -
అప్‌గ్రేడేషన్ ఎప్పుడో?
ఏళ్ల తరబడి పండిట్, పీఈటీల నిరీక్షణ సమాన పనికి సమాన వేతనం పొందని పండితులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ)లు తమ పోస్టుల అప్‌గ్రేడేషన్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో ఇతర సబ్జెక్టు టీచర్లు స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో ఎక్కువ వేతనం తీసుకుంటుండగా.. పండిట్లు, పీఈటీలు మాత్రం సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) స్థాయిలో తక్కువ వేతనంతోనే పనిచేయాల్సి వస్తోంది. ఏళ్ల తరబడి ఇదే తంతు కొనసాగుతోంది. స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా పనిచేస్తున్నా.. తమకు ఆ స్థాయి వేతనం ఇవ్వకపోవడం పట్ల వారు ఆవేదన చెందుతున్నారు. పైగా ఉన్నత పాఠశాలల్లో బోధించే వారంతా స్కూల్ అసిస్టెంట్లే ఉండాలని 2009లో ప్రభుత్వమే ఓ విధానం చేసింది. ఇందులో భాగంగా అప్పటివరకు ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న గ్రేడ్-2 పండిట్ పోస్టులను స్కూల్ అసిస్టెంట్-తెలుగు, స్కూల్ అసిస్టెంట్-ఉర్దూ, స్కూల్ అసిస్టెంట్-హిందీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టును ఫిజికల్ డెరైక్టర్ పోస్టులుగా మా ర్చింది. భవిష్యత్ నియామకాలన్నీ ఈ పద్ధతిలోనే చేపట్టాలని పేర్కొంది. కానీ అప్పటికే ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న పండిట్, పీఈటీల పోస్టులను అప్‌గ్రేడ్ చేసేందుకు మా త్రం సర్కారు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న 7 వేల మందికి పైగా పండిట్లు, 3 వేల మం ది కి పైగా ఉన్న పీఈటీలు తమ పోస్టుల అప్‌గ్రేడేషన్ కోసం ఆందోళన చెందుతున్నారు. జూనియర్ల కింద పనిచేస్తున్నాం భాషా పండితులకు పదోన్నతులు లేవు. దీంతో జూనియర్ల కింద పనిచేయాల్సి వస్తోంది. ఆత్మన్యూనతాభావం వేధిస్తున్నా ఉద్యోగం కోసం పనిచేయక తప్పడం లేదు. - పొన్నాల బాలయ్య, కరీంనగర్ సమాన పనికి సమానం వేతనం ఇవ్వాల్సిందే.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోతే ఎలా? స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా పనిచేస్తున్నా గుర్తించకపోతే ఎలా? ఏళ్ల తరబడి పండిట్లను, పీఈటీలను దోపిడీ చేస్తున్నారు. -ఎ.కుమారస్వామి, వరంగల్ అధిక ఉత్తీర్ణతకు కృషి చేస్తున్నాం తెలుగు, ఉర్దూ, హిందీ సబ్జెక్టుల్లో అధిక ఉత్తీర్ణతకు కృషి చేస్తున్నాం. పండితుల బోధన వల్లే ఈ ఫలితాలు వస్తున్నాయి. ఇతర సబ్జెక్టుల వారితో సమానంగా పనిచేస్తున్నాం. ఆయినా మమ్మల్ని గుర్తించకపోతే ఎలా? - వేల్పుల స్వామి, కరీంనగర్ ఇదేనా పండితులకిచ్చే మర్యాద సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భాషాభివృద్ధికి కృషి చేస్తున్నాం. అలాంటి పండితులకు ఇచ్చే మర్యాద ఇదేనా? పక్క టీచర్లతో సమాన వేతనం ఇవ్వకుండా అవమానాలకు గురిచేయడం సరైందేనా? ఒక్క ప్రభుత్వం ఆలోచించాలి. - బత్తిని వేణుగోపాల్, కరీంనగర్