పెళ్లికి వెళ్లి వచ్చేలోపు ఊడ్చుకెళ్లాడు
అందులోని ఒక కిలో 14 గ్రాముల బంగారు ఆభరణాలు, 7 కిలోల 100 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.3.5 లక్షల నగదు, రూ.4 లక్షల విలువచేసే గడియారం చోరీ కి గురయ్యాయి. గుప్తా ఇంట్లో రాంప్రసాద్ అనే వృద్ధుడితో పాటు బిహార్‌లోని దర్బంగ్ జిల్లాకు చెందిన ఉమేశ్ వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఆభరణాలు చోరీ కావడంతో అనుమానం వచ్చి తమ్ముడు నవీన్‌తో కలసి జితేందర్.. ఉమేశ్ ఇంటికి వెళ్లాడు. అప్పుటికే అతను పరారయ్యాడు. దీంతో ఉమేశ్ ఈ దొంగ తనం చేసి ఉండవచ్చని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉమేశ్ బంధువులను విచారిస్తున్నారు.