భార్య గొంతుపై కాలుతో తొక్కి హత్య
అడ్డగుట్ట: తన మాట వినడంలేదనిభార్యను కొట్టి... ఆపై గొంతుపై కాలు వేసి తొక్కి చంపేశాడో తాగుబోతు. తుకారాంగేట్ సీఐ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం... ఆదిలాబాద్‌జిల్లా నిర్మల్‌కు చెందిన శ్రీనివాస్(40), సాంబా(36) అలియాస్ సబిత దంపతులు. వీరికి కుమారులు శివకుమార్(9), నర్సింహ(7) సంతానం. కొంతకాలంగా వీరు తుకారాంగేట వడ్డెర బస్తీలోని పోచమ్మ ఆలయం వద్ద నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్ పెయింటర్ కాగా.. సాంబా ఇళ్లల్లో పని చేస్తోంది. శ్రీనివాస్ నిత్యం మద్యం తాగి నిర్మల్‌కు వెళ్దామని భార్యతో గొడవపడుతూ వేధిస్తున్నాడు.
భార్య మాత్రం ఇక్కడే ఉందామని భర్తతో చెప్తోంది. తన మాటల వినకపోవడంతో కక్షగట్టిన శ్రీనివాస్ రెండ్రోజులుగా పనికి పోకుండా మద్యం తాగుతూ భార్యను తీవ్రంగా వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాంబాను తీవ్రంగా కొట్టాడు. వీరింటి పక్కనే ఉండే శివకుమార్ అదే సమయంలో మంచినీళ్ల కోసం వచ్చాడు. భార్యను కొడుతున్న శ్రీనివాస్‌ను అడ్డుకోగా అతడిని కూడా కొట్టి బయటకు పంపేశాడు.
అనంతరం సాంబా గొంతుపై కాలు వేసి గట్టిగా తొక్కి చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న ఏసీపీ శివకుమార్, తుకారాంగేట్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ ఘటనా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాంబా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మాట వినడంలేదని...
Published Fri, Nov 13 2015 12:26 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement