పాతబస్తీ టు ఐసిస్: నిత్యం సంప్రదింపులు
తెలంగాణ పోలీసుల సహకారంతో నగరంలోని 14 ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు ఎన్‌ఐఏ ఐజీ సంజీవ్‌కుమార్ తెలిపారు. ఎన్‌ఐఏకు చెందిన అధికారులతో పాటు మొత్తం 100 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి పాతబస్తీలో సోదాలు జరిపారు. ఈ సందర్భంగా తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇలియాస్ జగ్దానీ, మహ్మద్ ఇలియాస్ ఇబ్రహీం అనే సోదరులు సహా 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఇద్దరు సోదరులే ఇక్కడి చర్యలకు కీలకంగా ఉన్నారని అనుమానిస్తున్నారు. అనుమానిత ఐఎస్ సభ్యుల నుంచి రూ.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరంతా సిరియాలోని ఐఎస్ ప్రధాన కార్యాలయంతో నిత్య సంప్రదింపులు జరుపుతున్నట్లు రూఢీ అయింది. హైదరాబాద్ నగరంలో వరుస పేలుళ్లకు కుట్ర పన్నుతున్నట్లు అనుమానిస్తున్నారు.