29 నుంచి కాపు ప్రముఖులతో ముద్రగడ భేటీ | Hyderabad tour after Mudragada Meeting With Kapu celebrities | Sakshi
Sakshi News home page

29 నుంచి కాపు ప్రముఖులతో ముద్రగడ భేటీ

Published Fri, Aug 26 2016 1:42 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM

29 నుంచి కాపు ప్రముఖులతో ముద్రగడ భేటీ - Sakshi

29 నుంచి కాపు ప్రముఖులతో ముద్రగడ భేటీ

మూడు రోజులపాటు హైదరాబాద్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం ఆయన అనుచరులతో కలిసి ఈనెల 29 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. రిజర్వేషన్ల ప్రకటనపై ఏపీ ప్రభుత్వం పెట్టిన గడువు ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆయన జరిపే ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ముద్రగడ నిరవధిక దీక్ష చేస్తున్నప్పుడు పలువురు కాపు ప్రముఖులు మద్దతు ప్రకటించారు. వివిధ పార్టీలకు చెందిన కాపు నేతలు దాసరి నారాయణరావు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పళ్లంరాజు, అద్దేపల్లి శ్రీధర్ వంటి ప్రముఖులు హాజరై కాపుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ముద్రగడ 29, 30 తేదీల్లో వరుస భేటీలను ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement