పలువురు ఐఏఎస్ల బదిలీలు
పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సాల్మొన్ ఆరోఖ్య రాజ్‌కు ఏపీఐఐసీ వీసీఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న ఎం. గిరిజా శంకర్‌ను ఆంధ్రప్రదేశ్ పర్యటక అభివృద్ధి సంస్థ (ఏపీ టీడీసీ) మేనేజింగ్ డెరైక్టర్‌గా బదిలీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ పరిశ్రమలు, వాణిజ్య (ఆహార శుద్ధి)శాఖ కార్యదర్శిగా కూడా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తించాలని గిరిజా శంకర్‌ను ఆదేశించింది.
ఏపీ మౌలిక సదుపాయాల సంస్థ (ఇన్‌క్యాప్) వీసీఎండీగా ఉన్న ఇండియన్ ఫారెస్ట్ సర్విస్ అధికారి రమేష్ కుమార్ సుమన్‌ను ఇంధన, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ నుంచి ఉపసంహరించి తదుపరి పోస్టింగ్ కోసం రాష్ట్ర అటవీ దళాల అధిపతిని సంప్రదించాలని సూచించింది. రాష్ట్ర ఫైబర్‌నెట్ వర్క్ మేనేజింగ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న కె.సాంబశివరావుకు ఇన్‌క్యాప్ వీసీఎండీగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది.