అబ్దుల్ బాసిత్
హైదరాబాద్: వచ్చే ఏడాది భారత్-పాకిస్తాన్ క్రికెట్ సిరీస్ ప్రారంభమవుతుందని భారత్లో పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చెప్పారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022 వరకు ఆరు సిరీస్లు నిర్వహించాలన్నది తమ ఆలోచనగా చెప్పారు. హైదరాబాద్ ప్రజల ఆదరాభిమానాలు మరిచిపోలేనివన్నారు. భారత్-పాక్ల మధ్య సంబంధాలు మెరుగుపడాలని ఆయన ఆకాంక్షించారు. దక్షిణాసియాలో వ్యాపార, వాణిజ్య సంబంధాలు వృద్ధి చెందాలన్నారు.
పాకిస్తాన్ తీవ్రవాద బాధితురాలని చెప్పారు. అక్కడ ఆత్మాహుతి దాడులు పెరిగిపోతున్నాయని బాధపడ్డారు. ఇప్పటికే 55వేల మంది అమాయక ప్రజలు చనిపోయారని తెలిపారు.
**