
దీక్ష విరమణ
గన్‌ఫౌండ్రీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ దీక్ష చేపట్టిన ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ బుధవారం దీక్షను విరమించారు. అబిడ్స్ మెడ్విన్ హాస్పిటల్‌లో దీక్ష కొనసాగిస్తున్న ఆయనకు రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.