ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: గ్రామజ్యోతి పథకం కింద ఆయా గ్రామపంచాయతీలకు నిధులు, సౌకర్యాలను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ దాఖ లైన పిల్‌పై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు, ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది.
పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రం గనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలకు కోట్ల రూపాయల మేర నిధులను విడుదల చేయ కుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోందంటూ మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, హైదర్ షా కోట్ సర్పంచ్ పి.కృష్ణారెడ్డి హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వం లోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపించారు.
‘గ్రామజ్యోతి’ పిల్‌పై విచారణ
Published Wed, Apr 5 2017 3:38 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement