Gramajyothi scheme
-
రోడ్లు అధ్వానం
తిర్యాణి : మండలంలోని గడలపల్లి పంచాయతీలోని డోంగర్‌గాం గ్రామానికి రహదారి సౌకర్యం లేక గ్రామస్తులు నానా తంటాలు పడుతున్నారు. గ్రామం దట్టమైన అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. ఇరవై కుటుంబాలు ఉన్నా ఈ గ్రామంలో ఎలాంటి సౌకర్యాలు లేక గ్రామస్తులు అష్టకష్టాలు పడుతున్నారు. పంచాయతీకి రావాలంటే కాలినడకే దిక్కు గడలపల్లి గ్రామ పంచాయతీ కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. గడలపల్లి నుంచి డోంగర్‌గాం గ్రామానికి వెళ్లే దారిలో మధ్యలో ఉన్న వాగు వరకు మట్టి రోడ్డే దిక్కు. ప్రతినిత్యం గడలపల్లికి రాని పరిస్థితి అని కాలినడకన గాని ఎడ్లబండిని ఆశ్రయించాల్సిందేనని గ్రామస్తులు వాపోతున్నారు. రేషన్ సరుకులను గడలపల్లి నుంచి నెత్తిపైనే మోసుకువస్తున్నామని చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం రోడ్డు సౌకర్యం కల్పించడానికి మొరం పోశారు. అది పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో ఎలాంటి వాహనాలు గ్రామానికి రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయంలో తప్పని తిప్పలు అత్యవసర సమయంలో బాధితులను ఆస్పత్రికి తరలించాలంటే నానా తంటాలు పడుతున్నామని వాపోతున్నారు. పిల్లలను బడికి పంపాలన్నా ఇబ్బందే. గ్రామంలో పాఠశాల లేదు. తప్పని పరిస్థితుల్లో పిల్లలను ఆశ్రమ పాఠశాలల్లోకి పంపిస్తున్నామని చెబుతున్నారు. ఆపత్కాలంలో అంబులెన్స్ కూడా రాని దుస్థితి. వచ్చిం దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామ సమస్యలు గుర్తించాలని కోరుతున్నారు. రోడ్డు సౌకర్యం కల్పించాలి గ్రామానికి రోడ్డు లేక ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. తాతల కాలం నుంచి ఇక్కడే నివసిస్తున్నా ఏ అధికారి గాని నాయకుడు గాని పట్టించుM øవడం లేదు. గ్రామం దగ్గర గుట్ట వద్ద మట్టి తీసి రోడ్డు వేస్తే గ్రామానికి ఆటోలన్నా వస్తాయి. – వెలది, బాదిరావు చర్యలు తీసుకోవాలి గ్రామానికి రోడ్డు లేక బాహ్య ప్రపంచానికి దూరంగా బతుకుతున్నాం. రహదారి ఉంటే గ్రామనికి అన్ని సౌకర్యాలు వచ్చేవి. గ్రామంలో ఒక్కరికీ కూడా పక్కా ఇళ్లు లేదు. రోడ్డు సౌకర్యం కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి. – గంగారాం ప్రతిపాదనలు పంపించాం గ్రామానికి రోడ్డు వేయాలని అనేకసార్లు ప్రతిపాదనలు పంపించాం. గ్రామజ్యోతి ప్రణాళికలలో కూడా ప్రతిపాదన ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావడం లేదు. నిధులు మంజూౖరు అయితే గ్రామానికి రోడ్డు వసతి కల్పించడం, వాగుపై వంతెన కూడా∙నిర్మాణం జరిగే అవకాశం ఉంది. – ఆత్రం లక్ష్మణ్, సర్పంచ్, గడలపల్లి -
‘గ్రామజ్యోతి’ పిల్‌పై విచారణ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు నోటీసులు సాక్షి, హైదరాబాద్: గ్రామజ్యోతి పథకం కింద ఆయా గ్రామపంచాయతీలకు నిధులు, సౌకర్యాలను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ దాఖ లైన పిల్‌పై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు, ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రం గనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలకు కోట్ల రూపాయల మేర నిధులను విడుదల చేయ కుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోందంటూ మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, హైదర్ షా కోట్ సర్పంచ్ పి.కృష్ణారెడ్డి హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వం లోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపించారు. -
పంచాయతీలకు మహర్దశ
► మరిన్ని అధికారాలు.. విధుల బదిలీకి సీఎం నిర్ణయం ► కేటీఆర్‌కు అధ్యయన బాధ్యత ► 164 కార్యదర్శుల పోస్టుల భర్తీకి అవకాశాలు ► మెరుగుపడనున్న గ్రామ పాలన సాక్షి, మంచిర్యాల : ఎటు చూసినా అపరిశుభ్ర వాతావరణం.. లోపించిన పారిశుధ్యం.. ఏళ్ల నుంచి పరిష్కారానికి నోచుకోని సమస్యలు.. అరకొర సిబ్బందితో ఏటా లక్ష్యం చేరుకోని ఆస్తి పన్ను వసూళ్లు.. ఇలాంటి సమస్యలు మరెన్నో గ్రామ పంచాయతీల అభివృద్ధికి అవరోధాలుగా మారాయి. మరోపక్క.. పల్లెల అభివృద్ధి కోసం గతేడాది ఆగస్టులో ప్రారంభించిన ‘గ్రామజ్యోతి’ పథకం అమలు ఊసే లేదు. పథకం ప్రారంభమై ఆరు నెలలు పూర్తయినా ఇంకా చాలా చోట్ల గ్రామసభలు కూడా పూర్తి కాలేదు. ఇలా.. పడకేసిన పంచాయతీలకు మహర్దశ తీసుకొచ్చే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. పంచాయతీల బలోపేతం.. బాధ్యతను మరింత పెంచే విధంగా గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలు బదలాయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పల్లె పాలన అభివృద్ధిని పర్యవేక్షించే పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి కల్వకుంట తారక రామారావు ఆధ్వర్యంలో అధికారులతో కూడిన ఓ కమిటీకి అధ్యయన బాధ్యతలు అప్పగించారు. అవసరమైతే.. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకొచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో.. అభివృద్ధిలో వెనకబడిన.. అత్యధిక మారుమూల గ్రామాలు.. సమస్యల్లో చిక్కుకున్న పల్లెలకు మహర్దశ రానుంది. జిల్లాలో 866 గ్రామ పంచాయతీలు జిల్లాలో 866 గ్రామ పంచాయతీలున్నాయి. రెండు, మూడు పంచాయతీలను కలిపి 580 క్లస్టర్లుగా చేశారు. 70శాతం జనాభా గ్రామాలో ్లనే ఉంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపం.. నిధుల వినియోగంలో అక్రమాల కారణంగా అభివృద్ధి కుంటుపడింది. కనీసం గ్రామాల్లో పారిశుధ్యం.. రక్షిత తాగునీరు సైతం అందుబాటులో లేకపోవడంతో ప్రజలు రోగాల బారినపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీలకు అధికారాలు.. విధులు.. బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మొన్నటి వరకు.. పారిశుధ్య నిర్వహణ, పన్నుల వసూళ్లు, నిధుల వినియోగం(సర్పంచులతో జాయింట్ చెక్‌పవర్).. పలు ధ్రువీకరణ పత్రాల జారీ వంటి చిన్న చిన్న పనులకే పరిమితమైన పంచాయతీ కార్యదర్శులకు ఇకపై క్షేత్రస్థాయిలో అమలయ్యే ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకంలో భాగస్వాములను చేసి.. వారికి బాధ్యతలు అప్పగించాలని సీఎం నిర్ణయించారు. దీంతో పనుల పురోగతికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం జిల్లాలో 580 క్లస్టర్లలో కేవలం 416 మంది కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. సీఎం నిర్ణయంతో జిల్లాలో ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న 164 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలున్నాయి. పంచాయతీల నుంచి ఏటా రూ. 17లక్షల ఆస్తిపన్ను వసూలు కావాలి. కానీ కార్యదర్శులు లేకపోవడంతో 65 శాతానికి మించి వసూళ్లు జరగడం లేదు. కార్యదర్శుల పోస్టులు భర్తీ అయితే పన్నుల వసూళ్లతోపాటు గ్రామాల్లో పారిశుధ్య, అభివృద్ధి పనుల పర్యవేక్షణకు వీలుంటుంది. మరోపక్క.. గ్రామజ్యోతి పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 654 డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు వాటిలో ఏడు మాత్రమే ఏర్పాటయ్యాయి. 276 చోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం విషయంలోనూ జిల్లా వెనకబడే ఉంది. జిల్లాకు 42,268 మరుగుదొడ్లు మంజూరైతే.. ఇప్పటివరకు 2,620 మాత్రమే పూర్తయ్యాయి. 8,346 నిర్మాణ దశలో ఉన్నాయి. పెద్ద ఇంకుడు గుంతల విషయానికొస్తే.. 5396 మంజూరైతే.. 1201 నిర్మాణ దశలో ఉన్నాయి. 179 మాత్రమే పూర్తయ్యాయి. చిన్న ఇంకుడు గుంతలు 40,255 మంజూరైతే.. 3,619 నిర్మాణ దశలో ఉన్నాయి. 800 మాత్రమే పూర్తయ్యాయి. సుమారు 14వేల పైచిలుకు శ్మశాన వాటికల నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా... ఇప్పటి వరకు రెండు వేలకు మించి శ్మశాన వాటికల నిర్మాణాలు జరగలేదు. పల్లెల్లో పనుల వేగ వంతం.. పారదర్శక పాలన అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 580 క్లస్టర్లలో ఈ-పంచాయతీలు చేసింది. ఇప్పటి వరకు 30కి మించి ఈ-పంచాయతీలు జిల్లాలో కానరాని పరిస్థితి. విద్యుత్, ఆన్ లైన్ సమస్యతోపాటు పర్యవేక్షణ లేకే ఈ పంచాయతీల లక్ష్యం అమలుకు ఆమడ దూరంలో ఉంది. స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరించేందుకు జిల్లాకు మూడు వేలకు పైగా సైకిల్ రిక్షాలు వచ్చే వీలుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి పథకంతోపాటు సీఎం కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో గ్రామాల దశ మారుతుందని జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య అభిప్రాయపడ్డారు. -
ఈ నెల 22న ఎంపీటీసీ సభ్యుల నిరసన దీక్ష
పంజగుట్ట(హైదరాబాద్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామజ్యోతి పథకంలో తమకు భాగస్వామ్యం కల్పించనందుకు నిరసనగా ఈ నెల 22వ తేదీన ఇందిరాపార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ ఎంపీటీసీల ఫోరం తెలిపింది. అదే విధంగా నేటి నుంచి అన్ని గ్రామ, మండల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ మాట్లాడుతూ... గ్రామజ్యోతి కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులకు భాగస్వామ్యం కల్పించాలని ఎన్నో సార్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కలసి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోయిందని చెప్పారు. గ్రామంలో సర్పంచ్, వైస్ సర్పంచ్, ఆఖరుకు వార్డు సభ్యులకు కూడా స్థానం కల్పించి తమను మాత్రం విస్మరించారని తెలిపారు. తమను ఈ ప్రభుత్వం ప్రజాప్రతినిధులుగా గుర్తించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6,473 మంది ఎంపీటీసీ సభ్యులు పార్టీలకు అతీతంగా ఈనెల 22న జరిగే నిరసన దీక్షలో పాల్గొంటారని కరుణాకర్ తెలిపారు.