తిర్యాణి : మండలంలోని గడలపల్లి పంచాయతీలోని డోంగర్‌గాం గ్రామానికి రహదారి సౌకర్యం లేక గ్రామస్తులు నానా తంటాలు పడుతున్నారు. గ్రామం దట్టమైన అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. ఇరవై కుటుంబాలు ఉన్నా ఈ గ్రామంలో ఎలాంటి సౌకర్యాలు లేక గ్రామస్తులు అష్టకష్టాలు పడుతున్నారు.
పంచాయతీకి రావాలంటే కాలినడకే దిక్కు
గడలపల్లి గ్రామ పంచాయతీ కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. గడలపల్లి నుంచి డోంగర్‌గాం గ్రామానికి వెళ్లే దారిలో మధ్యలో ఉన్న వాగు వరకు మట్టి రోడ్డే దిక్కు. ప్రతినిత్యం గడలపల్లికి రాని పరిస్థితి అని కాలినడకన గాని ఎడ్లబండిని ఆశ్రయించాల్సిందేనని గ్రామస్తులు వాపోతున్నారు. రేషన్ సరుకులను గడలపల్లి నుంచి నెత్తిపైనే మోసుకువస్తున్నామని చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం రోడ్డు సౌకర్యం కల్పించడానికి మొరం పోశారు. అది పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో ఎలాంటి వాహనాలు గ్రామానికి రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అత్యవసర సమయంలో తప్పని తిప్పలు
అత్యవసర సమయంలో బాధితులను ఆస్పత్రికి తరలించాలంటే నానా తంటాలు పడుతున్నామని వాపోతున్నారు. పిల్లలను బడికి పంపాలన్నా ఇబ్బందే. గ్రామంలో పాఠశాల లేదు. తప్పని పరిస్థితుల్లో పిల్లలను ఆశ్రమ పాఠశాలల్లోకి పంపిస్తున్నామని చెబుతున్నారు. ఆపత్కాలంలో అంబులెన్స్ కూడా రాని దుస్థితి. వచ్చిం దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామ సమస్యలు గుర్తించాలని కోరుతున్నారు.
రోడ్డు సౌకర్యం కల్పించాలి
గ్రామానికి రోడ్డు లేక ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. తాతల కాలం నుంచి ఇక్కడే నివసిస్తున్నా ఏ అధికారి గాని నాయకుడు గాని పట్టించుM øవడం లేదు. గ్రామం దగ్గర గుట్ట వద్ద మట్టి తీసి రోడ్డు వేస్తే గ్రామానికి ఆటోలన్నా వస్తాయి.
– వెలది, బాదిరావు
చర్యలు తీసుకోవాలి
గ్రామానికి రోడ్డు లేక బాహ్య ప్రపంచానికి దూరంగా బతుకుతున్నాం. రహదారి ఉంటే గ్రామనికి అన్ని సౌకర్యాలు వచ్చేవి. గ్రామంలో ఒక్కరికీ కూడా పక్కా ఇళ్లు లేదు. రోడ్డు సౌకర్యం కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– గంగారాం
ప్రతిపాదనలు పంపించాం
గ్రామానికి రోడ్డు వేయాలని అనేకసార్లు ప్రతిపాదనలు పంపించాం. గ్రామజ్యోతి ప్రణాళికలలో కూడా ప్రతిపాదన ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావడం లేదు. నిధులు మంజూౖరు అయితే గ్రామానికి రోడ్డు వసతి కల్పించడం, వాగుపై వంతెన కూడా∙నిర్మాణం జరిగే అవకాశం ఉంది.
– ఆత్రం లక్ష్మణ్, సర్పంచ్, గడలపల్లి
Comments
Please login to add a commentAdd a comment