సీఎంకు లేఖ రాసిన అమరావతి డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్
హైదరాబాద్: లండన్ మ్యూజియంలో ఉన్న అమరావతి శిల్ప సంపదను వెనక్కు తెప్పించేలా చర్యలు తీసుకోవాలని అమరావతి డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ముఖ్యమంత్రి 10వ తేదీన మూడు రోజుల పాట లండన్ పర్యటనకు వెళ్తున్న దృష్ట్యా లండన్ మ్యూజియంను సందర్శించి అక్కడి ప్రధాని క్యామెరన్‌తో మాట్లాడి మన సంపదను వెనక్కు తెప్పించాలని లేఖలో పేర్కొన్నారు.
భారత దేశానికి చెందిన రెండు వేల సంవత్సరాల నాటి బుద్ధుడి విగ్రహాన్ని భారత్‌కు ఇచ్చేందుకు ఆస్ట్రేలియా అంగీకరించిందని ఆ దిశగా ప్రయత్నాలు చేసి లండన్‌లో మన శిల్ప సంపదను తెప్పించి అమరావతిని టూరిజంగా అభివృద్ధి చేయాలని కోరారు. లండన్‌లోని బ్రిటీష్ మ్యూజియంలో అమరావతి గ్యాలరీ 33 ఏ పేరిట శిల్ప సంపదను ఇప్పటికీ భద్రపరచారని వాటిని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
శిల్ప సంపదను తెప్పించండి ‘బాబు’
Published Mon, Mar 7 2016 9:41 PM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM
Advertisement
Advertisement