హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ జర్నలిస్టులు బుధవారం ఆందోళనకు దిగారు. సోమాజీగూడ ప్రెస్క్లబ్ నుంచి రాజ్భవన్ వరకూ ర్యాలీగా బయల్దేరారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు.
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, సీనియర్ పాత్రికేయులు
'మీడియా స్వేచ్ఛను కాపాడండి, మీడియాపై ఆంక్షలు సిగ్గు...సిగ్గు, సాక్షి టీవి ప్రసారాలు పునరుద్దరించాలి, ప్రజా సమస్యలను ప్రసారం చేస్తూ ప్రసారాలు ఆపివేస్తారా, జర్నలిస్టుల ఐక్యత వర్థిల్లాలి' అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ర్యాలీ అనంతరం గవర్నర్ నరసింహన్కు వినతిపత్రం సమర్పించారు. మరోవైపు ఏపీలో సాక్షి ప్రసారాల నిలిపివేతపై ఇప్పటికే న్యాయపోరాటానికి దిగింది. సాక్షి ప్రసారాలకు ఆటంకం కలగకుండా చూడాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.