journalists protest
-
220 మంది మృతి.. జర్నలిస్ట్‌లను కాపాడండి..!
సాక్షి, న్యూఢిల్లీ : గతకొంత కాలంగా తెలంగాణలో జరుగుతున్న జర్నలిస్ట్‌ల మరణాలపై ఢిల్లీలో టీయూడబ్య్లూజే ధర్నాను నిర్వహించింది. ‘జర్నలిస్ట్‌లను కాపాడండి’ అంటూ ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్‌లో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి వామపక్ష పార్టీల నేతలు.. సురవరం సుధాకర్ రెడ్డి, సీతారా ఏచూరి, డీ రాజా హాజరై సంఘీభావం తెలిపారు. ఎన్‌యూజే నేత రాజ్ బిహారీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఐజేయూ నేత శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో గత నాలుగేళ్ల కాలంలో మరణించిన 220 మంది జర్నలిస్టులపై పుస్తకాన్ని విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని, ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ఏ రాష్ట్రంలో కూడా మరణించలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. జర్నలిజం కత్తిమీద సాములాంటి వృత్తని.. జర్నలిస్ట్‌ల సమస్యలను కారుణ్య దృష్టితో చూడొద్దని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. జర్నలిస్ట్‌ల సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని.. అందుకే 31 జిల్లాల జర్నలిస్టులు వచ్చి ఢిల్లీలో ధర్నా చేపట్టారని ఐజేయూ సెక్రటరీ జనరల్ అమర్ విమర్శించారు. తెలంగాణలో చనిపోయిన 220 మంది జర్నలిస్టులవి అసహజ మరణాలని, శ్రమ దోపిడి కారణంగానే వారు చనిపోయారని అన్నారు. కేసీఆర్ ఎవరితో మాట్లాడకుండా ఓ గడీని నిర్మించుకున్నారని, తెలంగాణలో నిరసన తెలిపే అవకాశం లేకుండా ధర్నాచౌక్‌ను ఎత్తివేశారని ఆయన మండిపడ్డారు. వందలాది జర్నలిస్టులు చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదని.. వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఐజేయూ నేత శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. -
గౌరీ లంకేష్ హత్యను ఖండిస్తూ నిరసన
-
సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర కీలకం
– ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పులివెందుల రూరల్ : సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో విలేకరులకు ఇంటి స్థలాలు, పక్కాగృహాల కోసం రిలే దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలేకరులు వృత్తి ఎంతో ఛాలెంజింగ్‌తో కూడుకుందన్నారు. 2010 నుంచి జర్నలిస్టులు ఇంటి స్థలాల కోసం అధికారులకు విన్నవించినా ప్రయోజనంలేదన్నారు. గతంలో దివంగత వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కొంతమందికి స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇళ్ల స్థలాల విషయం కలెక్టర్‌కు వివరించి తప్పకుండా ఇప్పిస్తామన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద పక్కాగృహాలను మంజూరు చేయిస్తామన్నారు. అనంతరం తహసీల్దార్ ప్రసాద్‌కు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. అనంతరం రిలే దీక్షలో కూర్చొన్న వారికి నిమ్మరసం అందించి విరమింపజేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల పరిశీలకుడు బలరామిరెడ్డి, నారాయణస్వామి, నరసింహారెడ్డి, వీరభద్రారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, జర్నలిస్ట్‌లు తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై జర్నలిస్టుల ధర్నా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ జర్నలిస్టులు బుధవారం ఆందోళనకు దిగారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ నుంచి రాజ్‌భవన్ వరకూ ర్యాలీగా బయల్దేరారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, సీనియర్ పాత్రికేయులు 'మీడియా స్వేచ్ఛను కాపాడండి, మీడియాపై ఆంక్షలు సిగ్గు...సిగ్గు, సాక్షి టీవి ప్రసారాలు పునరుద్దరించాలి, ప్రజా సమస్యలను ప్రసారం చేస్తూ ప్రసారాలు ఆపివేస్తారా, జర్నలిస్టుల ఐక్యత వర్థిల్లాలి' అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ర్యాలీ అనంతరం గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం సమర్పించారు. మరోవైపు ఏపీలో సాక్షి ప్రసారాల నిలిపివేతపై ఇప్పటికే న్యాయపోరాటానికి దిగింది. సాక్షి ప్రసారాలకు ఆటంకం కలగకుండా చూడాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
సాక్షి విలేకరులపై అక్రమ కేసులు అమానుషం
జిల్లా వ్యాప్తంగా పాత్రికేయుల నిరసన విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవరేజీకి వెళ్లిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, వీడియో జర్నలిస్టులపై తన అనుచరులతో కలసి దాడికి పాల్పడ్డ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లావ్యాప్తం గా సోమవారం పాత్రికేయులు ఆందోళన చేపట్టారు. దాడిచేసిన వారిని కఠినం గా శిక్షించాలని డిమాండ్ చేశారు. మదనపల్లె: అమరావతి భూ కుంభకోణాన్ని వెలికి తీసిన సాక్షి దినపత్రిక జర్నలిస్టులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి, విచారణ పేరుతో వేధింపులకు గురిచేయడం అమానుషమని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి బండపల్లి అక్కులప్ప అన్నారు. సోమవారం ఏపీయూడబ్ల్యూజే పిలుపుమేరకు స్థానిక సబ్ కలెక్టరేట్ ఎదుట ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. అక్కులప్ప మాట్లాడుతూ అమరావతి భూ కుంభకోణం విషయాన్ని వెలుగులోకి తెచ్చిన సాక్షి జర్నలిస్టులను ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందన్నారు. ఏ ఆధారాలతో జర్నలిస్టులు వార్తలు రాశారంటూ ప్రశ్నించిన ప్రభుత్వం ఇది ఒక్కటేనని విమర్శించారు. ఇటీవల కాలంలో రాష్ర్టంలో జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భౌతిక దాడులకు పాల్పడుతున్న అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులపై నాన్ బెయిబుల్ చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం సొంత జిల్లాలోనే జర్నలిస్టులకు భద్రత కరువైందన్నారు. దాడుల నివారణ కమిటీని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని, హెల్త్‌కార్డులకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ కృతికాబాత్రాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె ప్రెస్‌క్లబ్ ఆధ్యక్ష కార్యదర్శులు రమేష్, రాజు పట్టణంలోని ప్రింట్, ఎల క్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. -
‘నా కార్యాలయం.. నా ఇష్టం’
♦ జడ్పీ సీఈవో వితండవాదం ♦ ‘స్థాయీ’ భేటీలకు మీడియా వద్దే వద్దు ♦ వైస్‌చైర్మన్, జడ్పీటీసీలు, జర్నలిస్టుల ధర్నా సాక్షి, సంగారెడ్డి : జడ్పీ సీఈఓ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. గురువారం స్థాయీ సంఘం సమావేశాలకు విలేకరులను అనుమతించిన సీఈఓ వర్షిణి శుక్రవారం మళ్లీ పాతపల్లవే అందుకున్నారు. ఆమె తీరును నిరసిస్తూ వైస్ చైర్మన్ సారయ్య, సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, శోభారాణిపాండు, ఇందిర, మొయిజుద్దీన్, అమీనుద్దీన్ స్థాయీ సంఘం సమావేశాన్ని బహిష్కరించి జడ్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు మనోహర్‌గౌడ్, కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ ప్రభాకర్, టీడీపీ జడ్పీటీసీ శ్రీకాంత్‌గౌడ్ జర్నలిస్టులకు మద్దతుగా ధర్నాలో పాల్గొని సీఈఓ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం నిలిపివేత.. స్థాయీ సంఘం సమావేశంలో గురువారం జర్నలిస్టులను అనుమతించిన సీఈఓ శుక్రవారం ప్లేటు ఫిరాయించారు. సమావేశంలోకి జర్నలిస్టులను అనుమతించేదిలేదన్నారు. అయితే, జర్నలిస్టులు లేనిదే తాము సమావేశం ప్రారంభించేది లేదని జడ్పీ వైస్‌చైర్మన్ సారయ్య, సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, శోభ, ఇందిర అధికారులకు స్పష్టం చేశారు. 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం మధ్యాహ్నం 1 గంట వరకు ప్రారంభం కాలేదు. చివరకు సీఈఓ వర్షిణి.. వైస్‌చైర్మన్ సారయ్య, జడ్పీటీసీ సభ్యులతో సుమారు గంట పాటు చర్చించారు. ఆమె ఎంతకీ పంతం వీడకపోవడంతో తాము సమావేశం బహిష్కరిస్తున్నట్లు సారయ్య స్పష్టం చేశారు. అనంతరం సమావేశ మందరింలోకి వచ్చిన సీఈఓ జర్నలిస్టులను పంపించి వేయాలని సిబ్బందికి సూచించారు. గురువారం అనుమతించి ఈ రోజు ఎందుకు అనుమతించటం లేదని జర్నలిస్టులు ప్రశ్నించగా ‘నా కార్యాలయం..నాఇష్టం’.అంటూ ఆమె వాగ్వాదానికి దిగారు. సీఈఓ వర్షిణి తీరు వల్ల సమావేశాల సమయం వృథా అవుతోందని అధికారులు అంటున్నారు. సీఈఓ నిరంకుశ వైఖరి: సారయ్య జడ్పీ సీఈఓ నిరంకుశంగా వ్యవహరిస్తోందని జడ్పీ వైస్‌చైర్మన్ సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జడ్పీటీసీలు లేకుండానే కలెక్టర్ అనుమతితో సమావేశాలు నిర్వహిస్తానని చెప్పటం దారుణమన్నారు. ఆమెపై మంత్రి హరీష్‌రావు, చైర్పర్సన్ రాజమణి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. జెడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు మనోహర్‌గౌడ్ మాట్లాడుతూ సోమవారం జరిగే స్థాయీ సంఘం సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ప్రభాకర్ మాట్లాడుతూ జడ్పీ సీఈఓ నియంతలా వ్యవహరిస్తోంద న్నారు. టీడీపీ జడ్పీటీసీ శ్రీకాంత్‌గౌడ్ మాట్లాడుతూ సీఎం జిల్లాలో సీఈఓ ఇలా వ్యవహరించడం దారుణమని, ఇవి జడ్పీకి చీకటిరోజులన్నారు. ఆమె తమకు, మీడియాకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేదంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, శోభారాణి పాండు మాట్లాడుతూ వర్షిణి మండలాల్లో చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందుల పాలుచేస్తున్నట్లు ఆరోపించారు. ధర్నాలో జర్నలిస్టులు జేఏసీ అధ్యక్షుడు కృష్ణ, ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, జర్నలిస్టు సంఘం నాయకులు రమేశ్, మురళి, విష్ణు, ప్రసన్న, రవి, ఆరిఫ్, శ్యాంసుందర్‌రెడ్డి, నాగరాజుగౌడ్, సునీల్, అశోక్‌రెడ్డి, రాజుగౌడ్, సత్తార్, సతీష్ పాల్గొన్నారు. -
ఛానళ్ల నిలిపివేతపై సంబంధం లేదు
-
ఛానళ్ల నిలిపివేతపై సంబంధం లేదు
హైదరాబాద్ : కొన్ని ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై తమకు ఎలాంటి సంబంధం లేదని ఐటీ శాఖమంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఛానళ్ల ప్రతినిధులు, ఎంఎస్‌వోలు తేల్చుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, నాస్కామ్ మధ్య మంగళవారమిక్కడ ఎంవోయు జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఐటీ రంగంలో హైదరాబాద్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దుతామన్నారు. 4జీ, వైఫై జోన్‌గా నగరాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. ఐటీ రంగానికి ప్రాముఖ్యత ఇస్తామన్నారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద మంగళవారం మహిళ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. నోటికి నల్ల రిబ్బర్లు కట్టుకుని తమ నిరసన తెలిపారు. -
పత్రికా ఫోటోగ్రాఫర్లపై పోలీసుల దాడి
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా కదిరిలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. బాబు పర్యటనను కవర్ చేసేందుకు వచ్చిన పత్రికా ఫోటోగ్రాఫర్లపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. దాంతో పోలీసుల చర్యను నిరసిస్తూ జర్నలిస్టులు నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ...జర్నలిస్టులకు సర్థి చెప్పటంతో వివాదం సద్దుమణిగింది.