
సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర కీలకం
– ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల రూరల్ : సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో విలేకరులకు ఇంటి స్థలాలు, పక్కాగృహాల కోసం రిలే దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలేకరులు వృత్తి ఎంతో ఛాలెంజింగ్‌తో కూడుకుందన్నారు. 2010 నుంచి జర్నలిస్టులు ఇంటి స్థలాల కోసం అధికారులకు విన్నవించినా ప్రయోజనంలేదన్నారు. గతంలో దివంగత వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కొంతమందికి స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇళ్ల స్థలాల విషయం కలెక్టర్‌కు వివరించి తప్పకుండా ఇప్పిస్తామన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద పక్కాగృహాలను మంజూరు చేయిస్తామన్నారు. అనంతరం తహసీల్దార్ ప్రసాద్‌కు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. అనంతరం రిలే దీక్షలో కూర్చొన్న వారికి నిమ్మరసం అందించి విరమింపజేశారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ మండల పరిశీలకుడు బలరామిరెడ్డి, నారాయణస్వామి, నరసింహారెడ్డి, వీరభద్రారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, జర్నలిస్ట్‌లు తదితరులు పాల్గొన్నారు.