
ఛానళ్ల నిలిపివేతపై సంబంధం లేదు
హైదరాబాద్ : కొన్ని ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై తమకు ఎలాంటి సంబంధం లేదని ఐటీ శాఖమంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఛానళ్ల ప్రతినిధులు, ఎంఎస్వోలు తేల్చుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, నాస్కామ్ మధ్య మంగళవారమిక్కడ ఎంవోయు జరిగింది.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఐటీ రంగంలో హైదరాబాద్ను అగ్రగామిగా తీర్చిదిద్దుతామన్నారు. 4జీ, వైఫై జోన్గా నగరాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. ఐటీ రంగానికి ప్రాముఖ్యత ఇస్తామన్నారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద మంగళవారం మహిళ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. నోటికి నల్ల రిబ్బర్లు కట్టుకుని తమ నిరసన తెలిపారు.