Mso
-
పదేళ్ళకు ఎంఎస్‌వోల రిజిస్ట్రేషన్ రెన్యువల్
న్యూఢిల్లీ: శాటిలైట్ టీవీ ఎంఎస్‌వోల (మల్టీ–సిస్టం ఆపరేటర్లు) రిజిస్ట్రేషన్‌ను 10 ఏళ్ల వ్యవధికి రెన్యువల్ చేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కేంద్రానికి సూచించింది. ఇందుకోసం ప్రాసెస్ ఫీజును రూ. 1 లక్షగా నిర్ణయించాలని సిఫార్సు చేసింది. కేబుల్ టీవీ నెట్వర్క్స్ నిబంధనల్లో ఎంఎస్‌వోల రిజిస్ట్రేషన్ల రెన్యువల్ నిబంధనలు లేకపోవడంతో తగు సూచనలు చేయాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ కోరిన మీదట ట్రాయ్ ఈ మేరకు సిఫార్సులు చేసింది. రెన్యువల్‌కి దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరిగేలా చూడాలని, బ్రాడ్కాస్ట్ సేవా పోర్టల్ ద్వారా పత్రాలన్నీ డిజిటల్ విధానంలో అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించాలని పేర్కొంది. అలాగే రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం పెండింగ్‌లో ఉన్న ఎంఎస్‌వోల జాబితాను, నిర్దిష్ట గడువులోగా దరఖాస్తు చేసుకోని వాటి లిస్టును పోర్టల్‌లో పొందుపర్చాలని సూచించింది. ఒకవేళ దరఖాస్తు పరిశీలనలో ఉన్నా, నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచినా తుది నిర్ణయం తీసుకునే వరకూ సదరు ఎంఎస్‌వోలకు పొడిగింపునివ్వాలని పే ర్కొంది. గడువు తేదీ ముగియడానికి ఏడు నుంచి రెండు నెలల ముందు వరకూ రెన్యువల్ కోసం దరఖాస్తులను స్వీకరించవచ్చని ట్రాయ్ సూచించింది. రెండు నెలల కన్నా తక్కువ సమయంలో దరఖాస్తు చేసుకుంటే జాప్యానికి చూపిన కారణాలను పరిశీలించి శాఖ తగు నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. -
29 నుంచి ఆ టీవీ ఛానళ్లు రావు
సాక్షి, విజయవాడ : సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) తీసుకొచ్చిన కొత్త టారిఫ్ ఈ నెల 29 అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని తెలంగాణ ఎమ్మెస్వో అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఏపీ, తెలంగాణ ఎమ్మెస్వోలు బుధవారం విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎమ్మెస్వో అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. కేబుల్ ఆపరేటర్లు అతి తక్కువ ధరకే 200 నుంచి 300 ఛానల్స్ అందిస్తున్నారని, సుప్రీం కోర్టు తీర్పుతో ప్రేక్షకులపై అధిక భారం పడుతుందన్నారు. ఎమ్మెస్వోలు అన్ని తెలుగు ఛానళ్లను కేవలం రూ.40కే అందిస్తున్నారని, కోర్టు నిర్ణయంతో పే ఛానల్స్ అధిక రేట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఛానల్స్ అన్ని ఫ్రీ టు ఎయిర్ అయ్యేవరకు ప్రేక్షకులు సహకరించాలని కోరారు. పే చానల్స్‌ను చూడడం తగ్గిస్తే వాళ్లే దారికొస్తారని చెప్పారు. ఏపీ ఎమ్మెస్వో అసోషియేషన్ గౌరవాధ్యక్షుడు కడియల బుచ్చి బాబు మాట్లాడుతూ..సుప్రీం టారిఫ్ని అమలు చేస్తే ప్రేక్షకులపై రూ.600 భారం పడుతుందన్నారు. టారిఫ్‌పై ప్రేక్షకులకు, ఆపరేటర్లకు అవగాహన లేదని, కేంద్రం కనీసం ఆరు నెలల గడువు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జెమిని, ఈటీవి ,మాటీవి, జీ టీవి నుండి ఒక్కో ఛానల్ ని మాత్రమే ప్రేక్షకులకి అందించబోతున్నామని చెప్పారు. మిగతా చానళ్లని నిలిపివేస్తున్నామని ప్రకటించారు. రేపు డిల్లీకి వెళ్లి ఎమ్మెస్వోల తరఫున కేంద్రప్రభుత్వానికి మెమొరాండం అందిస్తామని చెప్పారు. -
‘మన టీవీ’ ప్రసారాలకు ఎంఎస్‌వో ఆమోదం
⇒ పోటీ పరీక్షల కోసం తొలి చానల్.. ⇒ నేటి నుంచి ప్రత్యక్ష ప్రసారాలు ⇒ ప్రసారాల ప్రణాళిక వెల్లడించిన సీఈవో శైలేశ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘మన టీవీ చానల్’ కార్యక్రమాలను కేబుల్ ద్వారా ప్రసారం చేసేందుకు రాష్ట్రంలోని ఎంఎస్‌వోలు అంగీకరించారు. కేబుల్ ప్రసారాలకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం హామీ ఇచ్చింది. శనివారం మన టీవీ కార్యాలయం ప్రాంగణంలో కేబుల్ ద్వారా మన టీవీ కార్యక్రమాల ప్రసారానికి సంబంధించి ఎంఎస్‌వోల సమావేశం జరిగింది. మన టీవీ సీఈవో శైలేశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, ఎంఎస్‌వోలు హాజరయ్యారు. దేశంలోనే తొలిసారిగా పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఘనత ‘మన టీవీ’కి దక్కుతుందని శైలేశ్‌రెడ్డి వెల్లడించారు. పేదలు, మారుమూల ప్రాంతాలకు చెందిన యువత, విద్యార్థులకు చేరడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి సహకరించాల్సిందిగా కోరారు. మనటీవీ ద్వారా ఆదివారం నుంచి గ్రూప్-2 అభ్యర్థుల కోసం ఉదయం 10 నుంచి 10.50 వరకు రసాయన శాస్త్రం, 11 నుంచి 11.50 వరకు సమాజ నిర్మాణం, మధ్యాహ్నం 12 నుంచి 12.50 వరకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఒంటి గంట నుంచి 1.50 వరకు రాజనీతి శాస్త్రం (పాలిటీ) అంశాలపై ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయని వెల్లడించారు. మన టీవీకి ఎంఎస్‌వోల సహకారం మన టీవీ కార్యక్రమాలను కేబుల్ నెట్వర్క్ ద్వారా ప్రసారం చేసేందుకు ఎంఎస్‌వోలు సంసిద్ధత వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చి దిద్దేందుకు సహకరిస్తామని ఎంఎస్‌వోల సంఘం ప్రతినిధి ఎం.సుభాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 60 మంది ఎంఎస్‌వోలు, 15 వేల మంది లోకల్ ఎంఎస్‌వోల ద్వారా సుమారు 90 లక్షల కుటుంబాలకు కేబుల్ ప్రసారాలు చేరవేస్తున్నామన్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మన టీవీ కార్యక్రమాల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని ఆర్వీఆర్ కేబుల్ ప్రతినిధి ఫణికృష్ణ సూచించారు. యువతను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడంలో తాము భాగస్వాములవుతామని హాత్వే ప్రతినిధి ఇంతియాజ్ తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సహకరిస్తామని సిటీ కేబుల్ ఎండీ శివరామకృష్ణ చెప్పారు. -
రిలయన్స్ జియోకి ఎంఎస్ఓ అనుమతి
న్యూఢిల్లీ: డిజిట ల్ కే బుల్ టీవీ విభాగంలో మల్టీ సర్వీస్ ఆపరేటర్‌గా (ఎంఎస్ఓ) వ్యవహరించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ జియో మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు కేంద్రం అనుమతినిచ్చింది. బ్రాడ్‌కాస్టర్ నుంచి వచ్చే ప్రోగ్రామింగ్ సర్వీసులను పలు లోకల్ కేబుల్ ఆపరేటర్ల (సబ్స్క్రైబర్స్)కు చేరవేయడమే ‘ఎంఎస్ఓ’ల ముఖ్య విధి. ఈ కేంద్ర అనుమతితో రిలయన్స్ జియో ఇక నుంచి ఐఎంసీఎల్, సిటీ కేబుల్ నెట్వర్క్, డెన్ నెట్వర్క్, హాత్వే వంటి వాటికి పోటీ ఇవ్వనుంది. నెట్వర్క్ 18, ఐబీఎన్ 7, సీఎన్‌బీసీ అవాజ్ వంటి మీడియా సంస్థలతోపాటు 14 ఎంటర్టైన్మెంట్ ఛానళ్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇంటిగ్రేటెడ్ బిజినెస్ కేబుల్ రూపంలో టెలికం, హైస్పీడ్ డాటా, డిజిటల్ కామర్స్, మీడియా, పేమెంట్ సర్వీసులను అందించే జియో బ్రాండ్‌ను రిలయన్స్ జియో అభివృద్ధి చేస్తోంది. -
ఛానళ్ల నిలిపివేతపై సంబంధం లేదు
-
ఛానళ్ల నిలిపివేతపై సంబంధం లేదు
హైదరాబాద్ : కొన్ని ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై తమకు ఎలాంటి సంబంధం లేదని ఐటీ శాఖమంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఛానళ్ల ప్రతినిధులు, ఎంఎస్‌వోలు తేల్చుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, నాస్కామ్ మధ్య మంగళవారమిక్కడ ఎంవోయు జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఐటీ రంగంలో హైదరాబాద్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దుతామన్నారు. 4జీ, వైఫై జోన్‌గా నగరాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. ఐటీ రంగానికి ప్రాముఖ్యత ఇస్తామన్నారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద మంగళవారం మహిళ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. నోటికి నల్ల రిబ్బర్లు కట్టుకుని తమ నిరసన తెలిపారు. -
తెలంగాణలో చానళ్ల నిలిపివేత సరికాదు
-
ఎమ్ఎస్ఓలపై చర్య తీసుకుంటాం!
న్యూఢిల్లీ: తెలంగాణలో న్యూస్ ఛానెళ్ల ప్రసారాల నిలిపివేత సరికాదని ఎమ్‌ఎస్‌ఓలకు చెబుతామని కేంద్ర సమాచారశాఖామంత్రి ప్రకాశ్ జవదేకర్ రాజ్యసభలో అన్నారు. నిబంధనలు పాటించని ఎమ్ఎస్ఓలపై చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. నిబంధనల్ని పాటించని ఎమ్ఎస్ఓల లైసెన్స్‌లను రద్దు చేసే అధికారం కూడా కేంద్రానికి ఉందని రాజ్యసభలో ప్రకాశ్ జవదేకర్ హెచ్చరించారు. న్యూస్ చానెల్ల నిలిపివేతపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖరాశామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రసారాల నిలిపివేతలో తమకు సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందని సభకు ఆయన తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, మీడియా స్వేచ్ఛను కాపాడాలని ప్రకాశ్ జవదేకర్ విజ్క్షప్తి చేశారు. మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాలని, జవాబుదారీకి స్వతంత్రసంస్థగా ఉండాలని ప్రకాశ్ జవదేకర్ సూచించారు. -
'హేళన చేసేలా టీవీ-9 చూపించడం విచారకరం'
-
'హేళన చేసేలా టీవీ-9 చూపించడం విచారకరం'
హైదరాబాద్ : అవహేళన చేసేవిధంగా కథనాలు ప్రసారం చేశారంటూ ఛానల్స్ ప్రసారాలు నిలిపివేయటం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. జడ్జిమెంట్ ఇవ్వకుండానే నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ఆయన బుధవారమిక్కడ ప్రశ్నించారు. ఎమ్ఎస్ఓల చర్య ప్రతీకార దాడిగా కనిపిస్తోందని జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఎంఎస్ఓలు ఈ నిర్ణయాన్ని స్వతంత్రంగా తీసుకుంటే సంతోషిస్తానని ఆయన అన్నారు. అయితే వారి నిర్ణయంలో ప్రభుత్వం ఒత్తడి ఉండకూడదన్నారు. అయితే ప్రసార మాధ్యమాలు కూడా స్వయం నియంత్రణ పాటించాలని ఆయన మరోవైపు వ్యాఖ్యలు చేశారు. మీడియాకు స్వేచ్ఛ ఉండాలని, అయితే అది హద్దులో ఉండాలన్నారు. శాసనసభను హేళన చేసేలా టీవీ-9 చూపించటం విచారకరమని జానారెడ్డి అన్నారు. ఆ చర్యను తాము ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ జెన్కోకు చెందిన అన్ని విద్యుత్ ప్లాంట్లతో విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న ముసాయిదా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ కోరటం సరికాదని జానారెడ్డి అన్నారు. అది విభజన చట్టాన్ని ఉల్లంఘించటమేనని అన్నారు. ఈఆర్ఎస్కి చంద్రబాబు లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందని జానా ప్రశ్నించారు. పీపీఏలను రద్దు చేయరాదంటూ కేంద్రాన్ని కోరతామన్నారు. ఇటువంటి కక్షసాధింపు చర్యలు సరికాదని ఆయన అన్నారు. -
ఫోన్ వాడే వాళ్లు తగ్గుతున్నారు!
న్యూఢిల్లీ: కొన్నాళ్ల కిందటి వరకూ టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య పెరగటమే తప్ప తగ్గటమన్నది వినిపించలేదు. కాకపోతే గడచిన ఏడాదిన్నరగా మాత్రం ఈ సంఖ్య తగ్గుతూ వస్తోంది. మంగళవారం టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2012 సెప్టెంబర్ నుంచి ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆ వివరాలు చూస్తే... 2013 సెప్టెంబర్ నాటికి టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 89.98 కోట్లు. 2013 జూన్ చివరి నాటికి ఈ సంఖ్య 90.3 కోట్లు 2012 సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్య 93.77 కోట్లు కేటగిరీల వారీగా చూస్తే గత ఏడాది జూన్ చివరి నాటికి 87.33 కోట్లుగా ఉన్న వెర్లైస్ వినియోగదారులు (జీఎస్ఎం, సీడీఎంఏ) అదే ఏడాది సెప్టెంబర్ నాటికి 87.05 కోట్లకు తగ్గారు. వైర్లైన్వినియోగదారుల సంఖ్య 2.97 కోట్ల నుంచి 2.92 కోట్లకు తగ్గింది. జీఎస్ఎం యూజర్ల సంఖ్య 80.21 కోట్ల నుంచి 0.69% వృద్ధితో 80.76 కోట్లకు పెరిగింది. సీడీఎంఏ వినియోగదారుల సంఖ్య 7.12 కోట్ల నుంచి 12% క్షీణించి 6.29 కోట్లకు తగ్గింది. మొత్తం ైవైర్లెస్ మార్కెట్లో జీఎస్ఎం వినియోగదారుల వాటా 93 శాతం. గతేడాది సెప్టెంబర్ నాటికి 19.33 కోట్ల మంది వినియోగదారులతో భారతీ ఎయిరెటెల్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వొడాఫోన్(15.55 కోట్ల మంది వినియోగదారులు), ఐడియా సెల్యులర్(12.72 కోట్లు) నిలిచాయి. గతేడాది సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి భారతీ ఎయిర్‌టెల్‌కు అత్యధికంగా (24.7 లక్షలు) వినియోగదారులు లభించారు. రెండో స్థానంలో ఎయిర్‌సెల్(22.8 లక్షలు) నిలిచింది. ఇదే క్వార్టర్‌కు రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ అత్యధికంగా (94.7 లక్షల మంది)వినియోగదారులను కోల్పోయింది. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారులు (మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులు కాకుండా) సంఖ్య 2.21 కోట్లుగా ఉంది. ఇక గతేడాది సెప్టెంబర్‌లో 18.82 కోట్ల మంది మొబైళ్ల ద్వారా ఇంటర్నెట్ను యాక్సెస్ చేశారు. జీఎస్ఎం నెట్‌వర్క్‌కు సంబంధించి జూన్ క్వార్టర్‌కు రూ.111గా ఉన్న ఒక్కో యూజర్‌పై లభించే సగటు ఆదాయం(ఏఆర్పీయూ) సెప్టెంబర్ క్వార్టర్‌కు రూ.109కు పడిపోయింది. సీడీఎంఏ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఏఆర్పీయూ రూ.98.35 నుంచి స్వల్పంగా రూ.98.22కు తగ్గింది.