ఎమ్ఎస్ఓలపై చర్య తీసుకుంటాం!
న్యూఢిల్లీ: తెలంగాణలో న్యూస్ ఛానెళ్ల ప్రసారాల నిలిపివేత సరికాదని ఎమ్‌ఎస్‌ఓలకు చెబుతామని కేంద్ర సమాచారశాఖామంత్రి ప్రకాశ్ జవదేకర్ రాజ్యసభలో అన్నారు. నిబంధనలు పాటించని ఎమ్‌ఎస్‌ఓలపై చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని ఆయన స్పష్టం చేశారు.
నిబంధనల్ని పాటించని ఎమ్ఎస్‌ఓల లైసెన్స్‌లను రద్దు చేసే అధికారం కూడా కేంద్రానికి ఉందని రాజ్యసభలో ప్రకాశ్ జవదేకర్ హెచ్చరించారు. న్యూస్ చానెల్ల నిలిపివేతపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖరాశామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ప్రసారాల నిలిపివేతలో తమకు సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందని సభకు ఆయన తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, మీడియా స్వేచ్ఛను కాపాడాలని ప్రకాశ్ జవదేకర్ విజ్క్షప్తి చేశారు. మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాలని, జవాబుదారీకి స్వతంత్రసంస్థగా ఉండాలని ప్రకాశ్ జవదేకర్ సూచించారు.