ఫోన్ వాడే వాళ్లు తగ్గుతున్నారు!
న్యూఢిల్లీ: కొన్నాళ్ల కిందటి వరకూ టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య పెరగటమే తప్ప తగ్గటమన్నది వినిపించలేదు. కాకపోతే గడచిన ఏడాదిన్నరగా మాత్రం ఈ సంఖ్య తగ్గుతూ వస్తోంది. మంగళవారం టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2012 సెప్టెంబర్ నుంచి ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.
ఆ వివరాలు చూస్తే...
2013 సెప్టెంబర్ నాటికి టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 89.98 కోట్లు.
2013 జూన్ చివరి నాటికి ఈ సంఖ్య 90.3 కోట్లు
2012 సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్య 93.77 కోట్లు
కేటగిరీల వారీగా చూస్తే
గత ఏడాది జూన్ చివరి నాటికి 87.33 కోట్లుగా ఉన్న వెర్లైస్ వినియోగదారులు (జీఎస్‌ఎం, సీడీఎంఏ) అదే ఏడాది సెప్టెంబర్ నాటికి 87.05 కోట్లకు తగ్గారు. వైర్‌లైన్‌వినియోగదారుల సంఖ్య 2.97 కోట్ల నుంచి 2.92 కోట్లకు తగ్గింది.
జీఎస్‌ఎం యూజర్ల సంఖ్య 80.21 కోట్ల నుంచి 0.69% వృద్ధితో 80.76 కోట్లకు పెరిగింది. సీడీఎంఏ వినియోగదారుల సంఖ్య 7.12 కోట్ల నుంచి 12% క్షీణించి 6.29 కోట్లకు తగ్గింది.
మొత్తం ైవైర్‌లెస్ మార్కెట్లో జీఎస్‌ఎం వినియోగదారుల వాటా 93 శాతం.
గతేడాది సెప్టెంబర్ నాటికి 19.33 కోట్ల మంది వినియోగదారులతో భారతీ ఎయిరెటెల్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వొడాఫోన్(15.55 కోట్ల మంది వినియోగదారులు), ఐడియా సెల్యులర్(12.72 కోట్లు) నిలిచాయి.
గతేడాది సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి భారతీ ఎయిర్‌టెల్‌కు అత్యధికంగా (24.7 లక్షలు) వినియోగదారులు లభించారు. రెండో స్థానంలో ఎయిర్‌సెల్(22.8 లక్షలు) నిలిచింది.
ఇదే క్వార్టర్‌కు రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ అత్యధికంగా (94.7 లక్షల మంది)వినియోగదారులను కోల్పోయింది.
మొత్తం ఇంటర్నెట్ వినియోగదారులు (మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులు కాకుండా) సంఖ్య 2.21 కోట్లుగా ఉంది.
ఇక గతేడాది సెప్టెంబర్‌లో 18.82 కోట్ల మంది మొబైళ్ల ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేశారు.
జీఎస్‌ఎం నెట్‌వర్క్‌కు సంబంధించి జూన్ క్వార్టర్‌కు రూ.111గా ఉన్న ఒక్కో యూజర్‌పై లభించే సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) సెప్టెంబర్ క్వార్టర్‌కు రూ.109కు పడిపోయింది. సీడీఎంఏ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఏఆర్‌పీయూ రూ.98.35 నుంచి స్వల్పంగా రూ.98.22కు తగ్గింది.