సాక్షి,హైదరాబాద్: కాచిగూడ-యశ్వంత్ పూర్ ట్రై వీక్లీ ఎక్స్‌ప్రెస్ శనివారం రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే బెంగళూరులో ప్రారంభించనున్నారు. ఇది మధ్యాహ్నం 12.30 కు బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 1.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. తిరిగి 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 3.30 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. మార్చి 3 నుంచి ఈ ట్రైన్ రెగ్యులర్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
యశ్వంత్‌పూర్-కాచిగూడ ట్రై వీక్లీ ప్రతి సోమ, బుధ,శుక్ర వారాల్లో మధ్యాహ్నం 2.30 గంటల కు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 3.40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మంగళ,గురు,శని వారాల్లో మధ్యాహ్నం 2 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 3.30 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. ఇది హిందూపూర్, ధర్మవరం, అనంతపురం, గుత్తి,డోన్, కర్నూల్,గద్వాల్, శ్రీరాంనగర్, మహబూబ్‌నగర్, జడ్చర్ల,షాద్‌నగర్ స్టేషన్‌లలో ఆగుతుంది. కాగా, యశ్వంత్‌పూర్-జబల్పూర్ వీక్లీ, యశ్వంత్‌పూర్-లక్నో వీక్లీ సూపర్‌ఫాస్ట్ ట్రైన్‌లను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించనున్నట్లు దక్షిణమధ్యరైల్వే సీపీఆర్వో తెలిపారు.
నేడు కాచిగూడ-యశ్వంత్‌పూర్ ట్రై వీక్లీ ప్రారంభం
Published Sat, Mar 1 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM
Advertisement