విద్యార్థులకు అసౌకర్యం కలగనివ్వం: మంత్రి కడియం | kadiam srihari talks abot telangana eamcet exam 2016 | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు అసౌకర్యం కలగనివ్వం: మంత్రి కడియం

Published Sun, May 15 2016 7:43 AM | Last Updated on Wed, Aug 15 2018 7:59 PM

kadiam srihari talks abot telangana eamcet exam 2016

హైదరాబాద్: ఎంసెట్ పరీక్షకు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ సెంటర్లు ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. 2.46 లక్షల మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు హాజరుకానున్నట్లు ఆయన తెలపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఇంజినీరింగ్ పరీక్షకు 'క్యూ' సెట్ ప్రశ్నాపత్రం ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

ఇంజినీరింగ్ పరీక్షకు 276 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, పోలీసు, ఆర్టీసీ, ఇతర ప్రభుత్వ సంస్థల సహకారం తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వివరించారు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు మెడికల్, అగ్రికల్చర్ ఎగ్జామ్ కు 190 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement