కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య | Kadiyam srihari takes on opposition parties | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య

Published Tue, Oct 20 2015 12:54 PM | Last Updated on Sun, Sep 3 2017 11:15 AM

Kadiyam srihari takes on opposition parties

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం హైదరాబాద్లో కడియం శ్రీహరి మాట్లాడుతూ... రైతులను మోసం చేసింది టీడీపీ, బీజేపీలే అని ఆరోపించారు.

అవినీతి, అక్రమాలు కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. మావోయిస్టులను పిట్టల్లా కాల్చిన ఘనత కాంగ్రెస్దేనంటూ ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. ఎన్కౌంటర్లు లేని తెలంగాణనే కావాలని తాము కోరుకుంటున్నట్లు కడియం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement