కేసీఆర్ రాజీనామా చేయాలి | KCR must resign :manda krishna madiga | Sakshi
Sakshi News home page

కేసీఆర్ రాజీనామా చేయాలి

Published Wed, Jun 4 2014 2:10 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

కేసీఆర్ రాజీనామా చేయాలి - Sakshi

కేసీఆర్ రాజీనామా చేయాలి

మంద కృష్ణమాదిగ
బౌద్ధనగర్, హిమాయత్‌నగర్, న్యూస్‌లైన్: దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన కేసీఆర్ వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ పార్శిగుట్టలోని ఎంఎస్‌పీ రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన ఒక రోజు నిరసన దీక్షను మంగళవారం ఆయన విరమించారు. అనంతరం ఆయన ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

అక్కడ ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడేనని వేయిసార్లు నమ్మించి మోసం చేసి అదే పదవిలో కూర్చున్న కేసీఆర్‌ను నీడలా వెంటాడదామని పిలుపునిచ్చారు. ఈనెల 10వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా దళిత సమాజం ‘విద్రోహ వారం’గా పాటించాలన్నారు. 11 నుంచి జూలై 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు.

ఆగస్టు 10న చలో హైదరాబాద్ పేరిట ‘దళిత ఆత్మగౌరవ మహాసభ’ నిర్వహిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మంగళవారం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం ముందు కృష్ణమాదిగ ‘విద్రోహ వారం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్రోహ దినాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని పిలుపునిచ్చారు. తమ కార్యకర్తలు జైలుకైనా వెళ్తారు కానీ దళితులను మోసం చేసిన కేసీఆర్‌ను వదిలేది లేదని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement