
'మొక్కలు నాటడమే కాదు.. రక్షించాలి'
హైదరాబాద్: హరితహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. హరితహారంలో భాగంగా రాష్ట్రమంతటా మొక్కలు నాటితే సరిపోదన్నారు.
నాటిన మొక్కలను సైతం రక్షించాల్సి అవసరం ఎంతైనా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. మొక్కల సంరక్షణ కోరకు అవసరమైతే ఫైరింజన్లు, వాటర్ ట్యాంకులను ఉపయోగించాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.