
సెల్‌ఫోన్ కోసం చంపేశాడు..
వీడిన చిన్నారుల హత్య కేసు మిస్టరీ
మృతులు అన్నదమ్ములు నిందితుడి అరెస్టు
హయత్‌నగర్: కవాడిపల్లిలో గతనెల 18న జరిగిన ఇద్దరు చిన్నారుల హత్య కేసును హయత్‌నగర్ పోలీసులు ఛేదించారు. సెల్‌ఫోన్ కోసం ఓ యువకుడు ఉన్మాదిగా మారి ఇద్దరినీ బండరాయితో మోది హత్య చేసినట్టు తేల్చారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన రాంకుమార్‌గాందో అబ్ధుల్లాపూర్‌మెట్ సమీపంలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద గుడిసెలు వేసుకొని ఉంటూ మేస్త్రీగా పని చేస్తున్నాడు. ఇతనికి ధరమ్‌రాజ్ రాంకుమార్ (10), మహేష్‌రాంకుమార్ (7) కొడుకులు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికే చెందిన బాగీరాం కుమారుడు సోహా న్‌కుమార్‌ఠాకూర్ (20) జీవనోపాధి కో సం నగరానికి వచ్చి రాంకుమార్ ఉండే ప్రాంతంలోనే గుడిసె వేసుకొని ఉంటున్నాడు.
మద్యానికి బానిసైన సోహాన్ తాను పనిచేసే మేస్త్రీ వద్ద కూలీలకు ఇస్తానని చెప్పి రూ.4 వేలు తీసుకున్నాడు. వాటిలో రూ. వెయ్యి ఖర్చు చేశాడు. మిగ తా రూ.3 వేలు జేబులో పెట్టుకోగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో తన ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే, చేతిలో డబ్బులు లేవు. అదే సమయంలో తన గుడిసె పక్కనే ఉండే రాంకుమార్ దంపతులు పనికి వెళ్లగా.. వారి కుమారులు ధరమ్‌రాజ్, మహేష్ లు సెల్‌ఫోన్‌తో ఆడుకుంటున్నారు. వారి చేతిలోని సెల్‌ఫోన్‌పై సోహాన్ దృష్టి పడింది. దానిని లాక్కొని అమ్ముకోవాలని భావించి వారి వెంట పరుగుతీశాడు. చిన్నారులు ప్రతిఘటించడంతో బండరాయితో మోది చంపేసి, సెల్‌ఫోన్ లాక్కు ని పారిపోయాడు. అబ్ధుల్లాపూర్‌మెట్‌లో రూ.150కి ఫోన్ అమ్మి అక్కడే మద్యం తాగి ఉడాయించాడు. సాయంత్రం తిరి గి వచ్చిన తల్లిదండ్రులకు పిల్లలు కనిపిం చకపోవడంతో గాలించగా.. గుడిసెలకు కొద్ది దూరంలో మృతదేహాలు కనిపిం చాయి. తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన హయత్‌నగర్ పోలీసులు సోహా న్‌పై అనుమానంతో అతడి స్వగ్రామం తో పాటు పలుచోట్ల గాలించారు. అతడి ఆచూకీ కోసం ఫొటోలు, కరపత్రాలు ప్రచురించి రైల్వేస్టేషన్లు, బస్టాప్‌ల్లో అతి కించడంతో పాటు మీడియా ద్వారా ప్రచారం చేశారు. చివరకు గురువారం రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నిం దితుడిని అదుపులోకి తీసుకొని విచారిం చగా తానే చిన్నారులు ధరమ్‌రాజ్, మహేష్‌లను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులకు డీసీపీ రివార్డు అందించారు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్, ఇన్‌స్పెక్టర్ నరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.