సబ్ కే సాత్ సబ్ క వికాస్‌లా బడ్జెట్
హైదరాబాద్: మోదీ సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు సానుకూలంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ఇది భారత రాజకీయ, ఆర్దిక సంస్కరణల బడ్జెట్ అని ప్రజలు దీన్ని అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సబ్ కే సాత్ సబ్ క వికాస్‌లా బడ్జెట్ ఉందని.. సానుకూల సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు.
దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ వెలుగులు అందాలని.. 2018 లోపు ఏ గ్రామం కరెంట్ లేకుండా ఉండకూడదని సర్కార్ తీసుకున్న నిర్ణయం అద్భుతమని కొనియాడారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదని.. మోదీ నిర్ణయాలకు కాంగ్రెస్ సహకరించాలని రాజకీయ పార్టీలు తప్పు చేస్తే దేశానికే ముప్పన్నారు.