
నటుడు కృష్ణంరాజుకు స్వల్ప అనారోగ్యం
హైదరాబాద్: కేంద్ర మాజీమంత్రి, సినీనటుడు కృష్ణంరాజు స్వల్ప అనారోగ్యం తో నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శేషగిరిరావు నేతృత్వంలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించగా అంతా నార్మల్‌గా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ లో చికిత్స పొదుతున్నారు. ఆయనను మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు దేశపతి శ్రీనివాస్ పరామర్శించారు. రామలింగారెడ్డి ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.