ఊరూరా బారు, బీరు.. | Laxman fires on government | Sakshi
Sakshi News home page

ఊరూరా బారు, బీరు..

Published Wed, Aug 16 2017 3:58 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Laxman fires on government

పంద్రాగస్టు వేడుకల్లో ప్రభుత్వంపై లక్ష్మణ్‌ విమర్శలు
 
సాక్షి, హైదరాబాద్‌: ఊరూరుకు బారు, బీరు ఇస్తామనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళ వారం ఇక్కడి బీజేపీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. అనంతరం లక్ష్మణ్‌ మాట్లాడుతూ, ఎంఐఎం సంతోషం కోసమే తెలంగాణకు స్వాతంత్య్ర దినోత్సవాలను నిర్వహించడం లేదని విమర్శించారు.

దళితులపై దాడులు, అవినీతి, మద్యానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement