‘హెరిటేజ్’లో నాణ్యత గాలికి | left to the Heritage' in the quality | Sakshi
Sakshi News home page

‘హెరిటేజ్’లో నాణ్యత గాలికి

Published Tue, May 5 2015 12:13 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

‘హెరిటేజ్’లో నాణ్యత గాలికి - Sakshi

‘హెరిటేజ్’లో నాణ్యత గాలికి

వనస్థలిపురం: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు చెందిన హెరిటేజ్ ఫ్రెష్ సూపర్ మార్కెట్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, కాల పరిమితి ముగిసిన ఆహార పదార్థాలను వినియోగదారులకు అంటగడుతున్నారని బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ సభ్యులు అచ్యుతరావు ఆరోపించారు. సోమవారం ఆయన వనస్థలిపురంలోని హెరిటేజ్ ఫ్రెష్ సూపర్‌మార్కెట్‌ను సందర్శించారు.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివారం తమ కుటుంబ సభ్యులు హెరిటేజ్ ఫ్రెష్ సూపర్ మార్కెట్ నుంచి కూల్‌డ్రింక్‌లు కొనుగోలు చేయగా అవి కాలపరిమితి ముగిసిట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో తాను సోమవారం సూపర్ మార్కెట్‌ను సందర్శించగా, కాలపరిమితి దాటిపోయిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు గుర్తించానన్నారు. దీనిపై సూపర్ మార్కెట్ సిబ్బందిని ప్రశ్నించగా వారు పొంతనలేని సమాధానం చెబుతున్నారని, ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement