సమాచార శాఖ పనితీరు భేష్‌ | Maharashtra Information Department comments in Hyderabad tour | Sakshi
Sakshi News home page

సమాచార శాఖ పనితీరు భేష్‌

Published Tue, Feb 14 2017 2:47 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

Maharashtra Information Department comments in Hyderabad tour

హైదరాబాద్‌ పర్యటనలో మహారాష్ట్ర ఐఅండ్‌పీఆర్‌ బృందం ప్రశంస

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సకాలంలో మీడియాకు చేరవేస్తూ తెలంగాణ సమాచార శాఖ (పబ్లిసిటీ సెల్‌) ప్రశంసనీయంగా పనిచేస్తోందని సోమవారం సచివాలయంలో మహారాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్‌ అజయ్‌ అంబేకర్‌ కితాబునిచ్చారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో అమలవుతున్న వివిధ కార్యక్రమాల అధ్యయనానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం అజయ్‌ అంబేకర్‌ అధ్యక్షతన సీనియర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్లు సురేఖ ములే, ప్రవీణ్‌ టాకే, విలాస్‌ బోడాకేలతో కూడిన అధికారుల బృందం హైదరాబాద్‌లో పర్యటించింది.

ఈ సందర్భంగా ప్రచార విభాగం ఇంచార్జ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మధుసూదన్‌ పబ్లిసిటీ సెల్‌ పనితీరును మహారాష్ట్ర బృందానికి వివరించారు. మహారాష్ట్రలో జర్నలిస్టులకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అజయ్‌ వివరించారు. తెలంగాణ జర్నలి స్టులకు అందుతున్న ఫలాలను అడిగి తెలుసుకున్నారు. సమాచార పౌర సం బంధాల శాఖలో ఉత్తమంగా అమలవు తున్న వాటిని తమ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టడానికి కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా జర్నలిస్టుల వెల్ఫేర్‌ ఫండ్‌ పథకం చాలా బావుందని, దీన్ని అధ్యయ నం చేసి నివేదికను తమ ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు.

అంతకు ముందు సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశమై అక్రిడిటేషన్‌ జారీ విధానం, మీడియాకు ప్రకటనల జారీ, వివిధ ప్రభుత్వ కార్యక్ర మాలు, ప్రము ఖుల సమావేశాలకు పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం ఏర్పాటు, జర్నలిస్టులకు రాయితీలు తదితర పథకాల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సమాచార పౌరసం బంధాల శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ నాగయ్య కాంబ్లే, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజనీర్‌ ఎల్‌. ఎల్‌.ఆర్‌.కిశోర్‌ బాబు, రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సుజాత, డిప్యూటీ డైరెక్టర్లు వెంకటేశం, భాస్కర్, మధుసూ దన్, శ్రీనివాస్, రీజినల్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజనీర్లు దామోదర్, విజయభాస్కర్‌రెడ్డి, అకౌంట్స్‌ అధికారి శౌరిరెడ్డి  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement