చిన్నారి కిడ్నాప్... రక్షించిన పోలీసులు | Mailardevpalli police rescues child, kidnapper arrested | Sakshi
Sakshi News home page

చిన్నారి కిడ్నాప్... రక్షించిన పోలీసులు

Published Fri, Dec 2 2016 10:28 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

Mailardevpalli police rescues child, kidnapper arrested

హైదరాబాద్: నగరంలోని ఒవైసీ హిల్స్ లో కిడ్నాప్ కు గురైన ఓ చిన్నారి కథను పోలీసులు సుఖాంతం చేశారు. మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒవైసీ హిల్స్ ప్రాంతానికి చెందిన జమ్మీ అనే ఏడాదిన్నర బాలికను దుండగులు గురువారం అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు. ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. 
 
సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితులున్న ప్రాంతాన్ని గుర్తించి దాడి చేశారు. చిన్నారిని రక్షించి ఆమె తల్లిదండ్రులకు అప్పజెప్పారు. కిడ్నాప్ కు పాల్పడిన యువకుడితో పాటు అతడికి సహకరించిన ఓ యువతిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement