'కేసీఆర్ రాజకీయ ఉగ్రవాది' | Mallu Bhatti Vikramarka takes on kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ రాజకీయ ఉగ్రవాది'

Published Sat, Jan 9 2016 1:59 PM | Last Updated on Mon, Oct 8 2018 9:21 PM

'కేసీఆర్ రాజకీయ ఉగ్రవాది' - Sakshi

'కేసీఆర్ రాజకీయ ఉగ్రవాది'

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క శనివారం హైదరాబాద్లో మండిపడ్డారు. రాజకీయ ఉగ్రవాది అంటూ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఇతర పార్టీలు లేకుండా చేయాలని ఆలోచనతోనే కేసీఆర్ రాజకీయ ఉగ్రవాదానికి తెరలేపుతున్నారని ఆరోపించారు. ఈ పద్దతి ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అని విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు.

అవినీతి సొమ్ముతో ఇతర పార్టీలకు చెందిన నేతలను ప్రలోభపెడుతున్నారని విమర్శించారు. జీహెచ్ఎంసీ డివిజన్ల రిజర్వేషన్ల ఖరారు శాస్త్రీయంగా జరగలేదన్నారు. ఏ ప్రాతిపదికన రిజర్వేషన్ల ఖరారు జరిగిందో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొత్తం ఓటర్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల శాతమెంతో చెప్పాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీల డివిజన్లు పెంచాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి భట్టి విక్రమార్క సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement