మత్యువు గెలిచింది.. ప్రేమ ఓడింది
Published Tue, Oct 25 2016 7:43 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
హైదరాబాద్: బంధువుల అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. అమ్మాయి కూడా ఇష్టపడటంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇంతలో ఏమైందో మూడు నెలల క్రితం ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో వివాహం జరిగిపోయింది. దీంతో ఆవేదన తట్టుకోలేక ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయినగర్‌కు చెందిన భానుప్రకాష్(32) పెయింటర్. దగ్గరి బంధువుల అమ్మాయిని ప్రేమించాడు.
మూడు నెలల క్రితం ఆమెకు వేరే వ్యక్తితో వివాహం జరగడంతో అప్పటి నుంచి ముభావంగా ఉంటున్నాడు. ఆమె లేని జీవితం వ్యర్ధం అనుకుని మంగళవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఫలించకపోవడంతో మరొకసారి కత్తితో పొడుచుకునేందుకు యత్నించాడు. ఆఖరకు మధ్యాహ్నం రెండన్నర గంటల సమయంలో ఇంటికి సమీపంలో గౌతంనగర్ రైల్వేగేట్ వద్ద కాచిగూడ నుంచి మేడ్చెల్‌కు వెళ్లే రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పై మృతుడి సోదరుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement