తలసానీ.. ఒళ్లు దగ్గర పెట్టుకో: మర్రి | marri shashidar reddy fired on thalasani srinivas yadav | Sakshi
Sakshi News home page

తలసానీ.. ఒళ్లు దగ్గర పెట్టుకో: మర్రి

Published Wed, Apr 27 2016 3:29 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM

తలసానీ.. ఒళ్లు దగ్గర పెట్టుకో: మర్రి - Sakshi

తలసానీ.. ఒళ్లు దగ్గర పెట్టుకో: మర్రి

సాక్షి, హైదరాబాద్: వ్యాపారులను వేధించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ శాఖ  మార్చడం సంతోషకరమని, ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి హితవు పలికారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా వ్యాపారులను బెదిరించి పెద్ద ఎత్తున తలసాని వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి మంత్రి నుంచి ఆ శాఖను తీసేయడం ద్వారా వ్యాపారులకు మేలు చేసినట్లయిందన్నారు. లాతూర్  కన్నా ఎక్కువ జనాభా ఉన్న హైదరాబాద్‌లో తీవ్ర నీటి ఎద్దడి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement