20 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ | may 20th from polycet counseling | Sakshi
Sakshi News home page

20 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్

Published Fri, May 13 2016 3:20 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM

20 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ - Sakshi

20 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్

28వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన
* 23 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు..
* 31న ఆప్షన్ల మార్పునకు అవకాశం
* జూన్ 1న సీట్ల కేటాయింపు.. 9 నుంచి తరగతులు
* జూలైలో రెండో దశ కౌన్సెలింగ్
* షెడ్యూల్ విడుదల చేసిన సాంకేతిక విద్యా డెరైక్టర్ ఎంవీ రెడ్డి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్-2016 ప్రవేశాల కౌన్సెలింగ్ ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

ఈ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యా డెరైక్టర్ ఎంవీ రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈనెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలి. వెరిఫికేషన్ చేయించుకున్నవారు ఈనెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జ్ట్టిఞట://్టటఞౌడఛ్ఛ్టి.జీఛి.జీ వెబ్‌సైట్‌లో ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 31న వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. జూన్ 1వ తేదీన సీట్లు కేటాయిస్తారు. 9వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. జూలైలో రెండో దశ కౌన్సెలింగ్ ఉంటుంది.

విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన కోసం జిల్లాల్లో 21 హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్‌లైన్ కేంద్రాలు, ర్యాంకుల వారీగా హాజరుకావాల్సిన వివరాలను పాలిసెట్ వెబ్‌సైట్‌లో పొందవచ్చు. పాలిసెట్ అర్హులు 1.03 లక్షల మంది ఉండగా.. మొత్తంగా 55,510 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
 
రెండు దఫాలుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్
ప్రతిరోజు రెండు దఫాలుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఉదయం 9 నుంచి ఒక విడత, మధ్యాహ్నం 1:30 నుంచి రెండో విడత ప్రారంభమవుతాయి. విద్యార్థులు వారికి ర్యాంకుల వారీగా కేటాయించిన రోజుల్లో హెల్ప్‌లైన్ కేంద్రాల్లో వెరిఫికేషన్‌కు హాజరుకావాలి. వికలాంగులు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, ఆంగ్లో ఇండియన్ కేటగిరీల వారికి మాత్రం హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంకు వద్ద ఉన్న సాంకేతిక విద్యా భవన్‌లో ఈనెల 20, 21 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

ఇందుకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో పొందవచ్చు. వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకెళ్లాలి. పాలిసెట్ హాల్‌టికెట్, ర్యాంకు కార్డు, పదో తరగతి మెమో (వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నది), 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్, 2016 జనవరి 1 తరువాత జారీ చేసిన ఆదాయం సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, టీసీ (కాలేజీలో చేరేప్పుడు ఇస్తే చాలు), ఆధార్ కార్డు, ప్రత్యేక కోటా ఉంటే ఆయా సర్టిఫికెట్లు, నివాసం సర్టిఫికెట్లను తీసుకెళ్లాలి. ఇక వెబ్ ఆప్షన్ల కోసం వన్‌టైమ్ పాస్‌వర్డ్ విధానాన్ని అమలు చేస్తారు.
 
‘ఆధార్’తో ప్రవేశాలు
ఈసారి పాలిటెక్నిక్ ప్రవేశాలను ఆధార్ ఆధారంగా చేపడుతున్నట్లు సాంకేతిక విద్య డెరైక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. ప్రతి విద్యార్థి ఆధార్ నంబర్‌ను కచ్చితంగా నమోదు చేయాల్సిందేని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీలన్నింటిలోనూ విద్యార్థులు, అధ్యాపకులకు బయోమెట్రిక్ హాజరు నమోదును తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు.

ఈసారి రికార్డు స్థాయిలో నెల రోజుల ముందే పాలిటెక్నిక్ ప్రవేశాలను పూర్తి చేస్తున్నామన్నారు. విద్యార్థులు డ్రాపవుట్ కాకుండా సిలబస్‌లో మార్పులు తెస్తున్నామని, కొన్ని బ్రాంచీల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీని తొలగించడంతోపాటు కొన్నింటిలో వాటి సిలబస్‌ను తగ్గిస్తున్నామని వెల్లడించారు. ఇంగ్లిషు పరీక్ష విధానంలో మార్పులు తెచ్చామని.. ఒకటి రెండు వాక్యాల్లోనే సమాధానాలు రాస్తే సరిపోయేలా చర్యలు చేపట్టామని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement