ఉప ప్రణాళిక నిధుల వ్యయంలో ఉపేక్ష వద్దు
అధికారులకు మంత్రి చందూలాల్ ఆదేశం
సాక్షి,హైదరాబాద్:సబ్‌ప్లాన్ నిధుల వ్యయంలో నిర్లక్ష్యం చేస్తే గిరిజనులకు అన్యాయం చేసిన వారవుతారని వివిధశాఖల అధికారులనుద్దేశించి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖమంత్రి అజ్మీరా చందూలాల్ వ్యాఖ్యానించారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన ఎస్టీ సబ్‌ప్లాన్‌నోడల్ ఏజెన్సీ సమావేశంలో ఉపప్రణాళిక వ్యయం తీరును మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్టీల కోసం కేటాయిస్తున్న ప్రతీపైసా వ్యయం చేయాల్సిందేనని, అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎస్టీ ఉపప్రణాళికను సమర్థంగా అమలుచేయాలని సూచించారు. గిరిజన పొదుపుసంఘాలకు పెద్ద ఎత్తున రుణాలను అందించాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. మెక్రో ఇరిగే షన్ ద్వారా ఎస్టీ రైతులకు ఉపకరించే చర్యలను తీసుకోవాలన్నారు. గిరిజనప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో పాలీహౌజ్ ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
తండాలు, గూడేలను ప్రధాన రోడ్లకు కలపడానికి రూ. 500 కోట్లు...
తండాలు, గూడేలను ప్రధానరోడ్లతో అనుసంధానించేందుకు ఈ ఏడాది రూ.500 కోట్లు వ్యయం చేయనున్నట్లు మంత్రి చందూలాల్ వెల్లడించారు.అదేవిధంగా జాతీయ ఉపాధిహామీపథకంతో సమన్వయం చే సుకుని మరో రూ.500 కోట్లతో అంతర్గతరోడ్లను తీర్చిదిద్దుతామన్నారు. గృహనిర్మాణానికి రూ.84 కోట్లు ఖర్చుచేయనున్నట్లు తెలియజేశారు. గిరిజనయువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పించేందుకు వీలుగా రూ.36కోట్లతో 9 యువజనకేంద్రాలను ఏర్పాటుచేస్తామన్నారు.