ajmeera chandulal
-
ములుగు నుంచి ముగ్గురు ఎంపీలు
ములుగు: ములుగు నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులు నాలుగుసార్లు లోక్‌సభ కు ప్రాతినిధ్యం వహించారు. వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో ములుగు నియోజకవర్గం ఉన్నప్పుడు రెండుసార్లు అజ్మీరా చందూలాల్, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో పోరిక బలరాంనాయక్, అజ్మీరా సీతారాంనాయక్ ఒక్కో సారి ఎంపీలుగా గెలుపొందారు. ముగ్గురూ తొలి ప్రయత్నంలోనే.. ములుగు నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు పోటీసిన అజ్మీరా చందూలాల్, పోరిక బలరాంనాయక్, అజ్మీరా సీతారాంనాయక్‌లు గెలుపొందడం విశేషం. అజ్మీరా చందూలాల్.. ములుగు మండలం జగ్గన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలోని సారంగపల్లికి చెందిన అజ్మీరా చందూలాల్ తొలిసారిగా 1996లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్‌రెడ్డిపై గెలుపొందారు. తదనంతరం రెండోసారి టీడీపీ తరుఫున 1998లో కాంగ్రెస్ అభ్యర్థి కల్పనాదేవిపై పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1999లో ములుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అయితే చందూలాల్ రెండు పర్యాయాల్లో కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఎంపీగా కొనసాగడం గమనార్హం. అజ్మీరా సీతారాంనాయక్ వెంకటాపురం(ఎం) మండలం మల్లయ్యపల్లికి చెందిన ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా 2014వ సంవత్సరంలో మహబూబాబాద్ పార్లమెంట్‌కి పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. పోరిక బలరాం నాయక్ 2009లో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ములుగు నియోజకవర్గం మహబూబాబాద్(ఎస్టీ) పార్లమెంట్ స్థానానికి కేటాయించబడింది. ఈ ఎన్నికల్లో ములుగు మండలం మదనపల్లికి చెందిన పోరిక బలరాంనాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి కుంజా శ్రీనివాస్‌పై గెలుపొందారు. కేంద్రంలో యూపీఓ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఎస్టీ కోటాలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మూడోసారి కాంగ్రెస్ పార్టీ తరుఫున 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
సబ్‌ప్లాన్‌పై అధ్యయన కమిటీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ఎస్టీ ఉప ప్రణాళికలో సవరణల కోసం గిరిజనసంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న బడ్జెట్ కేటాయింపుల్లో మార్పు లను దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై దృష్టి సారించేందుకు ఈ కమిటీని నియమించారు. ఎస్టీల సంక్షేమం, అభివృద్ధికి కొత్త పథకాలను సిఫార్సు చేయాలని ఈ కమిటీకి ప్రభుత్వం నిర్దేశించింది. కమిటీ సభ్యులుగా ఎంపీలు సీతారాం నాయక్, జి.నగేశ్, ఎమ్మెల్సీ రాములునాయక్, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, కోవా లక్ష్మి, సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు నియమితుల య్యారు. ఈ మేరకు ఎస్టీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. -
ట్రావెల్ టూరిజం ఫేర్‌ను ప్రారంభించిన చందులాల్
మాదాపూర్: రాష్ట్రంలో పర్యాటక రంగం 25 శాతం అభివృద్ధి చెందిందని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ట్రావెల్ టూరిజం ఫేర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అజ్మీరా చందులాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కట్టడాలను చూసేందుకు దేశ, విదేశాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో వస్తున్నారని పేర్కొన్నారు. అలాగే సందర్శకులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ టూరిజం ఫేరులో 182 ఎగ్జిబిటర్లతో స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఫేర్‌లో బుక్ చేసుకున్న వారికి అకామిడేషన్‌లో 20 శాతం, ట్రాన్స్‌పోర్టులో 10 శాతంలతో పాటు వివిధ విభాగాల్లో ప్రత్యేక రాయితీలను కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగనుంది. -
ఉప ప్రణాళిక నిధుల వ్యయంలో ఉపేక్ష వద్దు
అధికారులకు మంత్రి చందూలాల్ ఆదేశం సాక్షి,హైదరాబాద్:సబ్‌ప్లాన్ నిధుల వ్యయంలో నిర్లక్ష్యం చేస్తే గిరిజనులకు అన్యాయం చేసిన వారవుతారని వివిధశాఖల అధికారులనుద్దేశించి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖమంత్రి అజ్మీరా చందూలాల్ వ్యాఖ్యానించారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన ఎస్టీ సబ్ప్లాన్నోడల్ ఏజెన్సీ సమావేశంలో ఉపప్రణాళిక వ్యయం తీరును మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్టీల కోసం కేటాయిస్తున్న ప్రతీపైసా వ్యయం చేయాల్సిందేనని, అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎస్టీ ఉపప్రణాళికను సమర్థంగా అమలుచేయాలని సూచించారు. గిరిజన పొదుపుసంఘాలకు పెద్ద ఎత్తున రుణాలను అందించాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. మెక్రో ఇరిగే షన్ ద్వారా ఎస్టీ రైతులకు ఉపకరించే చర్యలను తీసుకోవాలన్నారు. గిరిజనప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో పాలీహౌజ్ ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తండాలు, గూడేలను ప్రధాన రోడ్లకు కలపడానికి రూ. 500 కోట్లు... తండాలు, గూడేలను ప్రధానరోడ్లతో అనుసంధానించేందుకు ఈ ఏడాది రూ.500 కోట్లు వ్యయం చేయనున్నట్లు మంత్రి చందూలాల్ వెల్లడించారు.అదేవిధంగా జాతీయ ఉపాధిహామీపథకంతో సమన్వయం చే సుకుని మరో రూ.500 కోట్లతో అంతర్గతరోడ్లను తీర్చిదిద్దుతామన్నారు. గృహనిర్మాణానికి రూ.84 కోట్లు ఖర్చుచేయనున్నట్లు తెలియజేశారు. గిరిజనయువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పించేందుకు వీలుగా రూ.36కోట్లతో 9 యువజనకేంద్రాలను ఏర్పాటుచేస్తామన్నారు. -
ఇచ్చిన నిధులు ఖర్చు చేయకపోతే ఎలా?
► సబ్‌ప్లాన్ నిధులపై అధికారులను ప్రశ్నించిన ► మంత్రి అజ్మీరా చందూలాల్ సాక్షి, హైదరాబాద్: గిరిజన తెగల ఉప ప్రణాళికకు అదనంగా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయకపోతే ఎలా అని ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ వివిధ శాఖల అధికారులను ప్రశ్నించారు. ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను వ్యయం చేయడంలో కొన్ని విభాగాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయనే ఆరోపణలున్నాయని, భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతమైతే ఆయా శాఖల అధికారులను బాధ్యులను చేస్తామని మంత్రి హెచ్చరించారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్లో ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుతీరుపై జరిగిన నోడల్ ఏజెన్సీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సబ్‌ప్లాన్‌కు కేటాయిస్తున్న నిధులను ఆయా విభాగాలు సకాలంలో ఖర్చుచేస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. -
‘డీడీల ద్వారా కల్యాణ లక్ష్మి ఆర్థిక సహాయం’
సాక్షి, హైదరాబాద్: ఎస్టీ లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి ఆర్థిక సహాయాన్ని డిమాండ్ డ్రాఫ్ట్‌ల ద్వారా అందించనున్నట్టు గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పలు బ్యాంకులకు ఆన్లైన్ సౌకర్యం లేకపోవడంతో లబ్ధిదారులకు సకాలంలో సహాయం అందడం లేదని ఫిర్యాదులు వచ్చాయని, దీంతో ఇకపై డీడీల రూపంలో సహాయాన్ని అందించాలని నిర్ణయించామన్నారు. -
‘కల్యాణలక్ష్మి’ నిబంధనల సడలింపు: చందూలాల్
సాక్షి,హైదరాబాద్: కల్యాణలక్ష్మి పథకంలో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి నిబంధనలను సడలిస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. షాదీముబారక్ నిబంధనలే ఈ పథకానికి వర్తింపజేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం జిల్లాస్థాయి అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో మాదిరి రెవెన్యూ, పంచాయతీ అధికారుల ధ్రువీకరణ అవసరం లేదని, ఓటరు గుర్తింపు కార్డు ఉన్న వారిని అర్హులుగా పరిగణించాలని సూచించారు. కాగా, వేసవి సెలవుల్లో హాస్టళ్లు తెరిచి బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తామని చందూలాల్ వెల్లడించారు. డ్రాపవుట్లను గుర్తించి పాఠశాలల్లో చేర్పిం చేలా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల సక్రమంగా పంపిణీ జరగకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కొత్త మంత్రుల జీవిత విశేషాలు...
తుమ్మల నాగేశ్వర్రావు తండ్రి : తుమ్మల లక్ష్మయ్య పుట్టిన తేదీ : 05-11-1953 రాజకీయ ప్రవేశం : 1983 విద్యార్హత: బీకాం భార్య: భ్రమరాంబ సంతానం: ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు స్వస్థలం : ఖమ్మం జిల్లా గొల్లగూడెం గతంలో పదవులు : నాలుగుసార్లు ఎమ్మెల్యే, చిన్న, భారీ నీటిపారుదల, ఎకై్సజ్, ఆర్ అండ్ బీ శాఖల మంత్రిగా బాధ్యతలు. ప్రత్యేక ఆసక్తి : వ్యవసాయం అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తండ్రి: ఎ.నారాయణరెడ్డి పుట్టిన తేదీ: 16-02-1949 రాజకీయాల్లోకి: 1984 విద్యార్హత: బీకాం, ఎల్ఎల్బీ భార్య: ఎ. విజయలక్ష్మి సంతానం: ఇద్దరు కుమారులు స్వస్థలం: ఎల్లపల్లి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా గతంలో పదవులు : జెడ్పీ చైర్పర్సన్, రెండుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు ఎంపీ ప్రత్యేక ఆసక్తి : క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు తలసాని శ్రీనివాస్‌యాదవ్ తండ్రి: టి. వెంకటేశ్‌యాదవ్ పుట్టిన తేదీ: 06-10-1965 రాజకీయాల్లోకి: 1994లో ప్రవేశించారు. విద్యార్హత: ఇంటర్మీడియెట్ భార్య: టి. స్వర్ణ సంతానం: ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు స్వస్థలం: సనత్‌నగర్, హైదరాబాద్ గతంలో పదవులు : నాలుగుసార్లు ఎమ్మెల్యే, కార్మిక, పర్యాటకశాఖల మంత్రి ప్రత్యేక ఆసక్తి: క్యారమ్స్ ఆడటం జూపల్లి కృష్ణారావు తండ్రి: జె. శేషగిరిరావు పుట్టిన తేదీ: 10-08-1955 రాజకీయాల్లోకి: 1999 విద్యార్హత: బీఏ భార్య: జె. సుజన సంతానం: ఇద్దరు స్వస్థలం: కొల్లాపూర్, మహబూబ్‌నగర్ గతంలో పదవులు : నాలుగుసార్లు ఎమ్మెల్యే, పౌరసరఫరాలు, దేవాదాయ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు ప్రత్యేక ఆసక్తి: సంగీతం డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తండ్రి: సి. నారాయణరెడ్డి పుట్టిన తేదీ: 03-02-1962 రాజకీయాల్లోకి : 1994 విద్యార్హత: బీహెచ్ఎంఎస్ భార్య: శ్వేత సంతానం: ఇద్దరు స్వస్థలం: జడ్చర్ల, మహబూబ్‌నగర్ గతంలో పదవులు : సర్పంచ్, సింగిల్ విండో చైర్మన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్, రెండుసార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు అజ్మీరా చందూలాల్ తండ్రి: మీతూ నాయక్ పుట్టిన తేది: 08-07-1954 రాజకీయాల్లోకి: 1981 విద్యార్హత: హెచ్ఎస్సీ భార్య: ఎ. శారద సంతానం: నలుగురు స్వస్థలం: ములుగు, వరంగల్ గతంలో పదవులు: సర్పంచ్, మూడుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు ఎంపీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ట్రైకార్ చైర్మన్. ప్రత్యేక ఆసక్తి: నేత్ర చికిత్స శిబిరాల ఏర్పాటు..