సాక్షి,హైదరాబాద్: కల్యాణలక్ష్మి పథకంలో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి నిబంధనలను సడలిస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. షాదీముబారక్ నిబంధనలే ఈ పథకానికి వర్తింపజేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం జిల్లాస్థాయి అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో మాదిరి రెవెన్యూ, పంచాయతీ అధికారుల ధ్రువీకరణ అవసరం లేదని, ఓటరు గుర్తింపు కార్డు ఉన్న వారిని అర్హులుగా పరిగణించాలని సూచించారు.
కాగా, వేసవి సెలవుల్లో హాస్టళ్లు తెరిచి బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తామని చందూలాల్ వెల్లడించారు. డ్రాపవుట్లను గుర్తించి పాఠశాలల్లో చేర్పిం చేలా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల సక్రమంగా పంపిణీ జరగకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘కల్యాణలక్ష్మి’ నిబంధనల సడలింపు: చందూలాల్
Published Tue, Mar 31 2015 2:06 AM | Last Updated on Tue, Oct 30 2018 8:01 PM
Advertisement
Advertisement