టీ-వ్యాలెట్ ఆవిష్కరించిన కేటీఆర్
Published Thu, Jun 1 2017 1:30 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘టీ-వ్యాలెట్’ను ఐటీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తాజ్ డెక్కన్‌లో గురువారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఆయన వ్యాలెట్ ను ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రైవేటు చెల్లింపులను ఎలాంటి అదనపు రుసుము లేకుండానే టీ-వ్యాలెట్ ద్వారా చెల్లించవచ్చు. ఉపకార వేతనాలు, పింఛన్లతో పాటు రేషన్ దుకాణాలకు దీన్ని అనుసంధానం చేయనున్నారు. ఫోన్ లేకున్నా మీ సేవ సెంటర్ల సహాయంతో టీ-వ్యాలెట్ ద్వారా లావాదేవీలు జరిపే అవకాశం ఉంది.
Advertisement