చే‘నేత’కు భరోసానిద్దాం | Minister KTR suggestion to the IT employees | Sakshi
Sakshi News home page

చే‘నేత’కు భరోసానిద్దాం

Published Tue, Aug 8 2017 12:22 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

చే‘నేత’కు భరోసానిద్దాం - Sakshi

చే‘నేత’కు భరోసానిద్దాం

- ఐటీ ఉద్యోగులూ వారానికోరోజు చేనేత వస్త్రాలు ధరించాలి 
- మంత్రి కేటీఆర్‌ సూచన
 
హైదరాబాద్‌: భారత్‌లో వ్యవసాయం తరువాత అంత మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగానికి చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని మంత్రి కె.తారకరామారావు చెప్పారు. దీనిలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సోమ వారం చేనేత వస్త్రాలు ధరిస్తున్నారన్నారు. తెలంగాణలో పనిచేస్తున్న 4 లక్షల మంది ఐటీ ఉద్యోగులు కూడా వారంలో ఒకరోజు చేనేత దుస్తులు ధరించి ఈ రంగాన్ని ప్రోత్సహిం చాలని కోరారు. ఇతర రంగాల వారు కూడా ముందుకు వచ్చి నేతన్నలకు భరోసానివ్వా లన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నగరంలోని నెక్లెస్‌ పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన, హ్యాం డ్లూమ్‌ వాక్‌ను కేటీఆర్‌ సోమవారం ప్రారం భించారు.

భారతీయ చేనేతలు, కళా నైపుణ్యా లను రాబోయే తరాలకు ఓ ఫ్యాషన్‌గా అందిం చడం, విదేశాల్లో మార్కెట్‌ కల్పించి చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు. ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన జైళ్ల శాఖ స్టాల్‌లోని ఉత్పత్తులను మంత్రి పరిశీలించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడు తూ... సీఎం ఆశీస్సులతో రూ.1,283 కోట్ల బడ్జెట్‌ను చేనేత, టెక్స్‌టైల్‌ రంగాలకు ప్రభు త్వం కేటాయించిందన్నారు. జియో ట్యాగింగ్‌ ద్వారా ఎన్ని మగ్గాలు, ఎన్ని కుటుంబాలున్నా యన్న నిర్దిష్ట సమాచారం సేకరించామన్నారు. చేనేత కార్మికులకు మార్కెట్‌ కల్పించడం, ఉత్పత్తుల కొనుగోలుకు రూ.147 కోట్లతో ప్రభుత్వం బై బ్యాక్‌ పథకం ప్రారంభించిం దన్నారు. 40 వేల మంది నేత కార్మికులకు పెన్షన్‌ ఇస్తున్నామని, వారి జీతంలో 8 శాతం జమచేస్తే ప్రభుత్వం దానికి 16 శాతం కలిపి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. దీనికి రూ.60 కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు. 
 
నూతన ఒరవడి కోసం... 
కొత్త తరానికి నప్పేలా ప్రైవేటు డిజైనర్ల సాయంతో విభిన్న దుస్తులను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు శిక్షణ ఇప్పిస్తున్నామని కేటీఆర్‌ చెప్పారు. వారి ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లోకి తీసుకెళ్లేలా నటి సమంతను బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెట్టామన్నారు. చేనేతలంటూ సామాజిక బాధ్యత కాదు... ఫ్యాషన్‌ కాన్సెప్ట్‌గా భావిస్తూ బడ్జెట్‌లో డిజైన్‌ డెవలప్‌మెంట్, వ్యాల్యూ ఎడిషన్, బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు. రాష్ట్రానికి ప్రధాని, రాష్ట్రపతి వచ్చినా, అంతర్జాతీయ ప్రముఖులు వచ్చినా వారికి చేనేత ఉత్పత్తులు ఇస్తూ విశేషమైన, విస్తృతమైన ప్రచారం కలిగేలా ముందుకు వెళ్తున్నామన్నారు.
 
కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరిట అవార్డులు...
చేనేత కళను ప్రోత్సహించడానికి వచ్చే చేనేత దినోత్సవం నుంచి ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరుతో 30 మంది చేనేత కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నట్టు కేటీఆర్‌ చెప్పారు. పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటుచేసిన ఎక్స్‌పో ఈ నెల 15 వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా కేటీఆర్‌కు చేనేత రంగ మహిళలు రాఖీ కట్టారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, కంట్రీక్ల బ్‌ చైర్మన్‌ రాజీవ్‌రెడ్డి, పద్మశ్రీ అవారు ్డగ్రహీత పోచం గోవర్ధన్, హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌ శైలజ, ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్, ఐటీ పరిశ్రమల ఆసియా అధ్యక్షులు రంగా పోతుల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement