Handmade clothing
-
నరసాపురం లేసులు.. ఒలింపిక్స్ వరకూ అల్లుకున్నాయి..
పారిస్ అంటే ఫ్యాషన్‌కు పుట్టినిల్లు. కానీ, మన తెలుగు మహిళలు ఆ ఫ్యాషన్ కేంద్రానికే ఫ్యాబ్రిక్స్ ఎగుమతి చేస్తున్నారు. పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రీడాకారులు ఉపయోగించే లేస్ వస్త్రాలు, దిండ్లు, తువాళ్లు మన నరసాపురం నుంచి తయారయ్యి విమానం ఎక్కాయి. ఇదీ మన ఘనత.సూది మొనకు దారం తగిలించి చకచకా వారి మునివేళ్లు కదిలించారంటే చాలు వన్నెచిన్నెల లేసులు క్షణాల్లో కళ్లముందు ఆవిష్కృతమవుతాయి. ఔరా అనిపించేలా హ్యాండ్ మేడ్ ఉత్పత్తులు సిద్ధమవుతాయి. అబ్బురపరిచే అల్లికలతో గోదావరి జిల్లాలకు ఖండాంతర గుర్తింపు తెచ్చిన అతివల హస్త నైపుణ్యం ఇప్పుడు పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్ వరకూ చేరింది. ఆ ఘనతను సాధించింది జిల్లా, నరసాపురం రూరల్‌కి చెందిన మారుమూల గ్రామం సీతారామపురం.లేసుల పరిశ్రమబ్రిటిష్ కాలంలో నరసాపురం జలరవాణాకు‡కేంద్రంగా ఉండేది. అప్పట్లో ఇక్కడకు వచ్చిన క్రిస్టియన్ మిషనరీ సంస్థలు పేద మహిళలకు ఉపాధిగా లేసు అల్లికలు నేర్పించారు. కాలక్రమంలో ఈ పని పెద్ద పరిశ్రమగా విస్తరించింది. పేద, ధనిక తేడా లేకుండా తీరిక వేళల్లో కాలక్షేపంగా అల్లికలు సాగిస్తుంటారు. నరసాపురం కేంద్రంగా కోనసీమ, రాజ మహేంద్రవరం, భీమవరం ్రపాంతాల్లో వేలాది కుటుంబాలు ఈ హస్తకళ ద్వారా జీవనోపాధి పొందుతున్నాయి. ఈ పనిలో ఉన్న మహిళలకు తోడ్పాటును అందించేందుకు 2005లో నాటి సి.ఎం. వైఎస్ రాజశేఖరరెడ్డి సీతారాంపురం వద్ద లేస్‌పార్క్‌ను ్రపారంభించారు. టవల్స్, టేబుల్ క్లాత్స్, లంచ్ మ్యాట్స్, క్రోషే బ్యాగ్స్, డెకో కుషన్స్, బీచ్ కలెక్షన్స్ తదితర మన హ్యాండ్ మేడ్ లేసు ఉత్పత్తులకు విదేశాల్లో మంచి ఆదరణ ఉంది. నరసాపురం పరిసరాల్లో లేసు ఉత్పత్తులను ఎగుమతి చేసే కంపెనీలు వంద వరకు ఉన్నాయి. మారుతున్న ఫ్యాషన్, అభిరుచులు, ఆర్డర్లకు అనుగుణంగా తమ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంటూ ట్రెండింగ్‌లో ఉంటూ చైనా, వియత్నాం దేశాలకు గట్టిపోటీనిస్తున్నారు గోదావరి జిల్లాల మహిళలు.. ఎంతో గర్వంగా ఉంది పారిస్ ఒలింపిక్స్‌కు మన లేసు, క్లాత్‌తో తయారుచేసిన ఉత్పత్తులు అందించే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. ఈ లేస్ ఇండస్ట్రీని ప్రభుత్వాలు గుర్తించి వ్యవస్థీకృతం చేస్తే విదేశాల్లో మనదేశ మహిళల నైపుణ్యానికి గుర్తింపు వస్తుంది. ఒలింపిక్స్‌కు పని చేసే అవకాశాన్ని మహిళలు ఎంత సంతోషంగా స్వీకరించారంటే ప్రతి ఒక్కరూ తామే గోల్డ్‌మెడల్ సాధించినంత ఆనందంగా ఉన్నారు.– కలువకొలను రామ్చంద్రుడు, జేజే ఎక్స్‌పోర్ట్స్ అధినేతపదేళ్లుగా లేసు అల్లికలుమా చిన్నతనంలో మా అమ్మ, పిన్నమ్మలు అంతా కూడా లేసు అల్లికలు అల్లేవారు. నాకు అçప్పటి నుంచి అల్లికలపై అవగాహన ఉంది. గత 10 ఏళ్లుగా లేసు అల్లికలు చేస్తున్నాను. పిల్లలిద్దరినీ కూడా ఉన్నత చదువులు చదివించుకోగలుగుతున్నాం. ఇంట్లో పనులు అయ్యాక ఖాళీ సమయంలో లేసు అల్లికల ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. – పులపర్తి లక్ష్మికుమారి, మొగల్తూరుపారిస్ వేదిక మీద మన లేసుఈ నెల 26 నుంచి పారిస్ వేదికగా ్రపారంభం కానున్న ఒలింపిక్స్ క్రీడా సంగ్రామంలో నరసాపురం ఉత్పత్తులు కొలువుదీరే అవకాశం దక్కింది. సీతారాంపురంలోని జేజే ఎక్స్‌పోర్ట్స్ సంస్థ కేంద్రం పరిధిలోని ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండీక్రాప్ట్స్ (ఈపీసీహెచ్) ద్వారా ఈ అర్డర్ సాధించినట్టు సంస్థ నిర్వాహకులు తెలిపారు. దాదాపు వంద రకాల డిజైన్లు పంపిస్తే వాటిలో ఆరు డిజైన్లను నిర్వాహకులు ఎంపిక చేశారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు, ప్రపంచ నలుమూలల నుంచి తరలివచ్చే సందర్శకులకు గుర్తుండిపోయే విధంగా ఒలింపిక్స్ థీమ్, లోగోలతో లేస్, ఫ్యాబ్రిక్లను ఉపయోగించి టవల్స్, డెకో కుషన్స్, బీచ్ కలెక్షన్స్, క్రోషే మ్యాట్స్ తదితర హ్యాండ్ మేడ్ ఉత్పత్తులను డిజైన్ చేసి సిద్ధం చేసి పారిస్‌కి పంపారు. త్వరలో మన లేసు ఉత్పత్తులు ఒలింపిక్స్ క్రీడాకారులతో పాటు సందర్శకుల చేతుల్లోకి చేరనున్నాయి. తమ ఉత్పత్తులకు అరుదైన గుర్తింపు దక్కడం పట్ల ఈ ్రపాంత మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు– విజయ్‌కుమార్ పెనుపోతుల, సాక్షి, భీమవరం.ఫొటోలు : సవరం కృష్ణానందం -
నేచురల్ డై హ్యాండ్‌మేడ్ ఎగ్జిబిషన్, వర్క్‌షాప్
సాక్షి, తెలంగాణ: ఇండియా హ్యాండ్‌మేడ్ కలెక్టివ్ ఆధ్వర్యంలో జూన్ 17-19 వరకు మూడు రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది. హైదరాబాద్‌కు ప్రత్యేకమైన సహజ రంగులతో, చేతితో తయారు చేసిన వస్తువులు కొలువు దీర నున్నాయి.బంజారాహిల్స్‌లోని తెలంగాణ క్రాఫ్ట్స్ కౌన్సిల్లో తొలిసారిగా ‘నేచురల్ డై హ్యాండ్‌మేడ్ ఎగ్జిబిషన్’ పేరుతో దీన్ని నిర్వహించ నున్నారు. ముఖ్యంగాకరోనా, లాక్డౌన్ సంక్షోభంతో అనేక ఇబ్బందులు పడుతున్న హస్తకళా కారులు, ఉత్పత్తులకు చేయూతనివ్వడంతోపాటు, స్వదేశీ బ్రాండ్ ఉత్పత్తిని ఏకతాటి పైకి తీసుకురావాలనేది తమ ధ్యేయమని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రదర్శనలో బెంగాల్ మస్లిన్, జమ్దానీ, కౌడి ఆర్ట్, కాలా కాటన్, లంబాడీ ఎంబ్రాయిడరీ ఆర్ట్ ఇతర సహజ రంగుల వస్త్రాలుంటాయి. పురుషులు, మహిళలు, పిల్లలకు వివిధ రకాల వస్త్రాలతోపాటు ప్రధానంగా చేతితో తయారు చేసిన వస్తువులుంటాయని పేర్కొన్నారు.ఇలాంటి దుస్తులను ధరించడం మనకు గర్వకారణం మాత్రమే కాదు ప్రేమకు సంబంధించిన విషయం. అలాగే కాలుష్య నివారణలో, మానవ, ఇతర వనరుల దోపిడీని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇండియా హ్యాండ్‌మేడ్ కలెక్టివ్ భాగస్వాములైన చేనేత కార్మికులు, కళాకారుల, నేత సంఘాలు, గ్రూప్స్ ఇందులో పాల్గొంటాయి. మిషన్ సమృద్ధిపథకంలో భాగంగా ఇండియా హ్యాండ్‌మేడ్ కలెక్టివ్, ‘S.A.L.T (సస్టైన్. యాక్ట్. లైవ్. ట్రాన్స్‌ఫార్మ్) స్టోరీస్‌లో మూడవ ఎడిన్లో దేశవ్యాప్తంగా ఉత్పత్తైన అద్భుత దుస్తులను, కళాఖండాలను వెలుగులోకి తేనున్నారు. జూన్ 17 ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌కు చెందిన మాజీ మిసెస్ ఇండియా, శిల్పా రెడ్డి డాక్టర్ రామాంజనేయులు (సీఎస్ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), మీనా అప్నేందర్ (క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ),దుర్గా వెంకటస్వామి (స్థాపకుడు, బ్లూ లోటస్)తో కలిసి ఈఎగ్జిబిషన్ను ప్రారంభించనున్నారు. అలాగే నాగేంద్ర సతీష్, ప్రొఫెసర్ శారదా దేవి, డాక్టర్ షర్మిలా నాగరాజు, అనంతూలాంటి నిపుణులు ఈ దుస్తుల ఉత్పత్తి విధానం, ప్రయోజనాలు, కళాకారులు కష్టాలు జీవనోపాధి అవకాశాలపై ప్రసంగిస్తారు. ఈ ప్రదర్శనతోపాటు,జూన్ 17న హ్యాండ్ స్పిన్నింగ్ వర్క్‌షాప్, జూన్ 18న నేచురల్ డైయింగ్ వర్క్‌షాప్ ఉన్నాయి. వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు ముందుగా నమోదు చేసుకోవడం అవసరం. రిజిస్ట్రేషన్, ఇతర సందేహాల నివృత్తి కోసం 7305127412ను సంప్రదించవచ్చు. -
Sheelaa Bajaj: ధీర వనిత.. నానమ్మ కథ
షీలా బజాజ్ వయసు 78. దేహం కదలికలు కష్టమయ్యే వయసు. కీళ్లు కదలికలు తగ్గే వయసు. కానీ, ఆమె మాత్రం చురుగ్గా వేళ్లు కదుపుతోంది. వేగంగా అడుగులు వేస్తోంది. ఊలుతో స్వెటర్లు అల్లుతోంది. చలికాలంలో చంటి పిల్లల పాదాలు, చేతులకు తొడిగే ఊలు సాక్సు, గ్లవ్స్ కూడా చక్కగా అల్లేస్తోంది. చేతిలో నైపుణ్యం ఉంటే వార్థక్యం కూడా దూరమవుతుందని చెబుతోంది షీలా బజాజ్. అంతేకాదు, తన మనుమరాలు యుక్తి 78 ఏళ్ల వయసులో తనను సంపాదనపరురాలిగా మార్చిందని సంతోషపడుతోంది షీలా బజాజ్. నానమ్మ కథ షీలా బజాజ్ జీవితంలో అనేక ఎదురుదెబ్బలకు గురైంది. కొడుకు అర్ధంతరంగా మర ణించాడు. అప్పటికి అతడి కూతురు యుక్తి చిన్నపాప. మనుమరాలిలో కొడుకును చూసుకుంటూ కోడలికి ధైర్యం చెబుతూ కుటుంబానికి అండగా నిలిచింది. ఆమె మనోధైర్యాన్ని చూసి విధికి కన్నుకుట్టినట్లుంది. కోడలిని కూడా పొట్టన పెట్టుకుంది. ఇక మిగిలింది తనూ, మనుమరాలు యుక్తి. ఆ పాపకి నానమ్మలోనే అందరూ. ఇప్పటికీ నానమ్మ అని చెప్పాల్సినప్పుడు యుక్తి ‘అమ్మ’ అనే సంబోధిస్తుంది. అంతటి అనుబంధం వాళ్లది. నానమ్మ కథ వినకుండా ఏ రోజూ నిద్రపోయేది కాదు యుక్తి. ఆ కథలన్నింటిలోనూ ఒకటే నీతి ఉండేది. కష్టం అనేది ఉండదు, పరిస్థితులు మాత్రమే ఉంటాయి. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడమే మనం చేయాల్సింది, చేయగలిగింది. ఈ నీతిని వింటూ పెరిగింది యుక్తి. నానమ్మ చెప్పిన కథలన్నింటికంటే ఆమె జీవిత కథే తనకు అత్యంత స్ఫూర్తివంతం అంటుంది యుక్తి. కాలం తన సమయాన్ని తాను పాటిస్తూ ముందుకు సాగిపోయింది. యుక్తి చదువుకుని, ఉద్యోగంలో చేరింది. షీలా బజాజ్ లో ఒంటరితనం మొదలైంది. ఇంతలో కరోనా వచ్చింది. ‘‘అమ్మ రోజంతా ఎంత ఒంటరితనానికి లోనవుతుందనేది నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో గమనించాను. ఆమెకు తెలియకుండానే ఆమెను తనకిష్టమైన పనిలో నిమగ్నం అయ్యేలా చేయగలిగాను. నాకు చిన్నప్పుడు అల్లినట్లే స్కార్ఫ్‌లు, స్వెటర్లు అల్లిపెట్టమ్మా... అని అడిగాను. ఊలు చేతిలోకి తీసుకున్న తర్వాత ఆమె ఇక చాలన్నా వినలేదు. ‘ఇలా అల్లుతూ ఉంటే.... నీ చిన్ననాటి రోజులే కాదు, నా చిన్ననాటి రోజులు కూడా గుర్తుకు వస్తున్నాయి’ అంటూ తనకు తోచినవన్నీ అల్లుతూ ఉండేది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. అవి కావాలని అడిగిన వాళ్లకు అమ్మేసి, ఆ డబ్బు ఇచ్చాను. తాను సంపాదనపరురాలినయ్యానని తెలిసిన ఆ క్షణం చూడాలి అమ్మ సంతోషం. నా బాల్యంలో నా ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఎంత భరోసానిచ్చిందో నాకిప్పటికీ గుర్తే. ఇప్పుడు నా పెంపకంలో ఉన్న అమ్మకు అంతటి భరోసా కల్పించడం నా బాధ్యత కదా’’ అంటోంది యుక్తి. మెదడు చురుకుదనం వేళ్లలో ఇక షీలా బజాజ్ అయితే... తన సృజనాత్మకతకు పదును పెట్టి ఊలుతో దిండు కవర్లు, కుషన్ కవర్లు, బాటిల్ కవర్, మగ్ వార్మర్ వంటి వినూత్నమైన అల్లికలను రూపొందిస్తోంది. ఇంత శ్రమ వద్దంటే వినదు కూడా. ‘ఈ వయసులో ఇంత వేగంగా అల్లగలగడం అంటే నాకెంతో గర్వం కదా. వేగం ఎందుకు తగ్గించుకోవాలి’ అని ప్రశ్నిస్తోంది. ‘డిజైన్‌కి అనుగుణంగా వేళ్లు వేగంగా కదులుతున్నాయంటే నా మెదడు కూడా అంతే చురుగ్గా ఉందని అర్థం’ అంటున్నప్పుడు ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వు ఆమె పెదవుల మీద విరుస్తుంది. నిజమే... మనోధైర్యం ఉంటే పెరిగే వయసు ఉత్సాహానికి అడ్డంకిగా మారదు. చదవండి: International Day of Older Persons: అమ్మానాన్నలకు ఏం చేస్తున్నాం? -
చే‘నేత’కు భరోసానిద్దాం
- ఐటీ ఉద్యోగులూ వారానికోరోజు చేనేత వస్త్రాలు ధరించాలి - మంత్రి కేటీఆర్ సూచన హైదరాబాద్: భారత్‌లో వ్యవసాయం తరువాత అంత మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగానికి చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని మంత్రి కె.తారకరామారావు చెప్పారు. దీనిలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సోమ వారం చేనేత వస్త్రాలు ధరిస్తున్నారన్నారు. తెలంగాణలో పనిచేస్తున్న 4 లక్షల మంది ఐటీ ఉద్యోగులు కూడా వారంలో ఒకరోజు చేనేత దుస్తులు ధరించి ఈ రంగాన్ని ప్రోత్సహిం చాలని కోరారు. ఇతర రంగాల వారు కూడా ముందుకు వచ్చి నేతన్నలకు భరోసానివ్వా లన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నగరంలోని నెక్లెస్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన, హ్యాం డ్లూమ్ వాక్‌ను కేటీఆర్ సోమవారం ప్రారం భించారు. భారతీయ చేనేతలు, కళా నైపుణ్యా లను రాబోయే తరాలకు ఓ ఫ్యాషన్‌గా అందిం చడం, విదేశాల్లో మార్కెట్ కల్పించి చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు. ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన జైళ్ల శాఖ స్టాల్‌లోని ఉత్పత్తులను మంత్రి పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడు తూ... సీఎం ఆశీస్సులతో రూ.1,283 కోట్ల బడ్జెట్‌ను చేనేత, టెక్స్టైల్ రంగాలకు ప్రభు త్వం కేటాయించిందన్నారు. జియో ట్యాగింగ్ ద్వారా ఎన్ని మగ్గాలు, ఎన్ని కుటుంబాలున్నా యన్న నిర్దిష్ట సమాచారం సేకరించామన్నారు. చేనేత కార్మికులకు మార్కెట్ కల్పించడం, ఉత్పత్తుల కొనుగోలుకు రూ.147 కోట్లతో ప్రభుత్వం బై బ్యాక్ పథకం ప్రారంభించిం దన్నారు. 40 వేల మంది నేత కార్మికులకు పెన్షన్ ఇస్తున్నామని, వారి జీతంలో 8 శాతం జమచేస్తే ప్రభుత్వం దానికి 16 శాతం కలిపి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. దీనికి రూ.60 కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు. నూతన ఒరవడి కోసం... కొత్త తరానికి నప్పేలా ప్రైవేటు డిజైనర్ల సాయంతో విభిన్న దుస్తులను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు శిక్షణ ఇప్పిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. వారి ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకెళ్లేలా నటి సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టామన్నారు. చేనేతలంటూ సామాజిక బాధ్యత కాదు... ఫ్యాషన్ కాన్సెప్ట్‌గా భావిస్తూ బడ్జెట్లో డిజైన్ డెవలప్మెంట్, వ్యాల్యూ ఎడిషన్, బ్రాండ్ ప్రమోషన్ కోసం ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు. రాష్ట్రానికి ప్రధాని, రాష్ట్రపతి వచ్చినా, అంతర్జాతీయ ప్రముఖులు వచ్చినా వారికి చేనేత ఉత్పత్తులు ఇస్తూ విశేషమైన, విస్తృతమైన ప్రచారం కలిగేలా ముందుకు వెళ్తున్నామన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట అవార్డులు... చేనేత కళను ప్రోత్సహించడానికి వచ్చే చేనేత దినోత్సవం నుంచి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో 30 మంది చేనేత కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నట్టు కేటీఆర్ చెప్పారు. పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటుచేసిన ఎక్స్పో ఈ నెల 15 వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా కేటీఆర్‌కు చేనేత రంగ మహిళలు రాఖీ కట్టారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, కంట్రీక్ల బ్ చైర్మన్ రాజీవ్‌రెడ్డి, పద్మశ్రీ అవారు ్డగ్రహీత పోచం గోవర్ధన్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ డైరెక్టర్ శైలజ, ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఐటీ పరిశ్రమల ఆసియా అధ్యక్షులు రంగా పోతుల పాల్గొన్నారు.