
ప్రమాదరహిత తెలంగాణకు కృషి
రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రమాదరహిత తెలంగాణ సాధనకు కృషి చేస్తామని రవాణా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. 17 నుంచి 23 వరకు జరగనున్న రోడ్డు భద్రత వారోత్సవాల పోస్టర్లను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు.
దేశంలో ఏటా 1.5 లక్షల మంది, రాష్ట్రంలో 7 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో అత్యధికంగా సైబరాబాద్ పరిధిలో 1,125 మంది మృత్యువాత పడ్డారు. తర్వాతి స్థానాల్లో మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలున్నాయి’’ అని చెప్పారు. ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామన్నారు.