ఓటమి భయం పట్టుకున్నది కాంగ్రెస్‌కే: కర్నె
సాక్షి, హైదరాబాద్: ఓటమి భయం పట్టుకుంది ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాదని, కాంగ్రెస్ పార్టీ నేతలకే ఆ భయం పట్టుకుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌వి దిగజారుడు రాజకీయాలని, కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు కేసులు వేస్తున్నది కడుపు మండి కాదని, కండ్లు మండి ప్రజల ఉసురు పోసుకుంటున్నారని ఆరోపించారు.
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కాక, కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేస్తున్నందుకు సిగ్గుపడాలని మండిపడ్డారు. వివిధ ప్రాజెక్టులు, ప్రభుత్వ నిర్ణయాలపై కేసులు వేసినందుకు సీఎల్పీ నేత జానారెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా ముక్కు నేలకు రాసి లక్ష గుంజీలు తీయాలన్నారు.