సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌ను పంజగుట్టలా మోడల్ పోలీస్‌స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు పోలీస్‌శాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రపంచ స్థాయి పోలీసింగ్‌లో భాగంగా 700 పోలీస్‌స్టేషన్లను ఆధునీకరించేందుకు రంగం సిద్ధం చేసింది. రెండు దశలుగా స్టేషన్ల ఆధునీకరణ చేపట్టాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లాల పర్యటన, పోలీస్‌స్టేషన్లు, వాటి పరిస్థితులు, సదుపాయాలపై డీజీపీ అధ్యయనం చేసిన విషయం తెలిసిందే.
ఒక్కో స్టేషన్‌కు రూ.15 లక్షలు..
బాధితులు పోలీస్ స్టేషన్‌కు వస్తే స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేలా తీర్చిదిద్దాలని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లోని అన్ని స్టేషన్లను ఇప్పటికే ఆధునీకరించారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్, వెయిటింగ్‌హాల్, అడ్మిన్ అధికారి, సిబ్బంది, ఎస్‌ఐలకు క్యాబిన్లు, ప్రత్యేక విశ్రాంతి బ్యారక్‌లు, మహిళా సిబ్బందికి ప్రత్యేకమైన విశ్రాంతి గదులు నిర్మించాలని భావిస్తున్నారు.
ప్రతి ఫైలు, కేసు షీటు, పెండింగ్ కేసులను విభజించి భద్రపరిచేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇంటర్‌నెట్ సౌకర్యం, బాధితులకు మౌలిక సదుపాయాలు, కౌన్సెలింగ్ సెంటర్ అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. ఇందుకు ఒక్కో స్టేషన్‌కు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు అవసరం అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment