
జీవన విధానం మార్చుకుంటే చాలు...
హైదరాబాద్ : ప్రజల జీవన విధానాన్ని మార్చుకుంటే చాలు... కేన్సర్ను జయించవచ్చని టీడీపీ ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రిలో నూతన సంవత్సర వేడుకల్లో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో సర్వేకల్ కేన్సర్పై అవగాహాన, పరీక్షల కోసం ఏర్పాటు చేసిన క్యాంపును నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.