‘రైతుల పాలిట శాపంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం’
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని బచావో తెలంగాణ మిషన్ వ్యవస్థాపకుడు నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో గురువారం మాట్లాడుతూ.. కరువు మండలాలను ప్రకటించి నెలలు గడిచినా సీఎం కేసీఆర్, మంత్రులు వాటిని పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. కరువు నివారణకు కేంద్రం రూ. 358 కోట్లు ఇచ్చినా, రైతుల కోసం రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. కేసీఆర్ అనుభవరాహిత్యంతో రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న నష్టంపై జూన్ 1న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని పేర్కొన్నారు.